కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 7 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో ఆలయ ప్రాంగణంలో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు ఎంఎస్ పార్థసారథి, కందికుంట వెంకట ప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు మాట్లాడారు.
తిరువీధుల్లో ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకుని నారసింహుడి బ్రహ్మోత్సవాలకు సహకరించాలన్నారు. చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్, డీఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ పి.భానుప్రసాద్, కౌన్సిలర్ రాజశేఖరాచారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా బ్రహ్మోత్సవాలు
Published Wed, Feb 15 2017 10:56 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
Advertisement