పెంబర్తి బ్రాస్‌ సొసైటీకి రూ.1.80 కోట్లు | Brass Society pembarti Rs 1.80 crore | Sakshi
Sakshi News home page

పెంబర్తి బ్రాస్‌ సొసైటీకి రూ.1.80 కోట్లు

Published Wed, Aug 10 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

Brass Society pembarti Rs 1.80 crore

జనగామ : హస్తకళలకు పుట్టినిల్లయిన పెంబర్తి బ్రాస్‌ సొసైటీకి భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తన నిధుల నుంచి రూ.10 లక్షలు, కేంద్రం నుంచి మరో రూ.1.70 కోట్లు మంజూరు చేయించారు.
ఈవిషయాన్ని ఆయన మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ నిధులను సాధించేందుకు గత ఆరు నెలలుగా తాను చేసిన ప్రయత్నాలు ఫలించాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్‌ మిశ్రాను కలిసి పెంబర్తి హస్తకళల పరిశ్రమ గురించి, ఇక్కడి కార్మికుల స్థితిగతులను వివరించానన్నారు. ఈ– మార్కెటింగ్‌ ద్వారా హస్తకళా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు నిధులను వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement