ఇంధన సామర్థ్యంపై ‘బ్రిక్స్’ చర్చలు | Bricks discussions on fuel capacity | Sakshi
Sakshi News home page

ఇంధన సామర్థ్యంపై ‘బ్రిక్స్’ చర్చలు

Published Tue, Jul 5 2016 8:58 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

Bricks discussions on fuel capacity

- విశాఖలో 2 రోజుల సదస్సు ప్రారంభం
 సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ ఇంధన సామర్థ్యసదస్సు సోమవారం విశాఖలో ప్రారంభమైంది. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రెండురోజుల సదస్సులో ‘బ్రిక్స్’ భాగస్వామ్య దేశాలైన భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొంటున్నాయి. ఇంధన రంగంలో ఈ దేశాలు సాధించిన ప్రగతి గురించి  సమీక్షిస్తున్నారు.  ఏపీలోని విశాఖలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు గురించి ఇంధనశాఖ అడిషనల్ సెక్రటరీ బి.పి.పాండే విదేశీ ప్రతినిధులకు వివరించారు.

తమ దేశాలు అవలంబిస్తున్న విద్యుత్ సామర్థ్యం పెంపు-ఆదా విధానాలపై  ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రిక్స్ దేశాల ప్రతి నిధులు చర్చించారు. రాత్రి 7 గంటలకు విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ దీపాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భారత్ నుంచి బి.పి.పాండేతో పాటు బిఈఈ సెక్రటరీ సంజయ్‌సేత్, ఈఈఎస్‌ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement