విశాఖ : ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు విశాఖపట్నంలో బుధవారం ప్రారంభమైంది. మూడు రోజులు పాటు జరిగే ఈ సందస్సులో బ్రిక్స్ దేశాలైన బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. విదేశాలకు చెందిన 72 మంది, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 259 మంది ప్రతినిధులు, మరికొందరు ప్రముఖులతో కలసి దాదాపు 500 మంది హాజరవుతున్నారు.
పట్టణీకరణ, పర్యావరణహిత నగరాలు, ప్రణాళిక, అభివృద్ధి తదితర అంశాలను సదస్సులో ప్రస్తావించనున్నారు. ఈ సదస్సుకు కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసారశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ తదితరులు హాజరవుతారు. ముగింపు రోజు పట్టణీకరణపై విశాఖ డిక్లరేషన్ ఉంటుంది.
విశాఖలో బ్రిక్స్ సదస్సు ప్రారంభం
Published Wed, Sep 14 2016 12:40 PM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM
Advertisement
Advertisement