
పెళ్లయిన నెలకే..
తనకు వేరే సంబంధాలు వస్తున్నాయని, రూ.7 లక్షలు ఇస్తామంటున్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని వీర్రాజు బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులను తట్టుకోలేక లక్ష్మి మంగళవారం ఇంట్లో శ్లాబ్ హుక్కుకు ఓణీతో ఉరివేసుకుని, ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసమే వీర్రాజు ఆమెను వేధించి, హతమార్చి ఉంటాడని మృతురాలి తల్లి మచ్చా మహాలక్ష్మి ఆరోపించింది. వివాహం జరిగిన నెల రోజులు కూడా సంతోషంగా లేకుండా, తమ కుమార్తెను వేధించాడని విలపించింది. సంఘటన స్థలానికి సెంట్రల్ జోన్ డీఎస్పీ కులశేఖర్, త్రీటౌన్ సీఐ శ్రీరామకోటేశ్వరరావు, ఎస్సై సత్యనారాయణ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.