వంతెనలు లేక అవస్థలు
వంతెనలు లేక అవస్థలు
Published Fri, Jul 29 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
కొత్తగూడ : వర్షాలు కురిసిన సమయంలో మండలంలోని రౌతుగూడెం, చింతగట్టు తండా, వేపచెట్టు తండాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని వేలుబెల్లి, బూర్కపల్లి వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేలుబెల్లి, బూర్కపల్లి వాగులపై వంతెనలు నిర్మించి తమ కష్టాలను తొలగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు అం దజేసినా పట్టించుకోవడంలేదదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వాగులు పొంగుతుండడంతో రౌతు గూడెం, చింతగట్టుతండా, వేపచెట్టుతండాలకు ఎలాంటి వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదు. దీంతో ఇక్కడి ప్రజలు మండల కేంద్రానికి నడిచి వచ్చి అక్కడి నుంచి వాహనాల్లో తమ ప్రయాణాలను కొనసాగిస్తుంటారు. వర్షాకాలంలో కొందరు వాగుదాటి వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ప్రత్యేక చొరవ చూపి బూర్కపల్లి వాగుపై లోలెవల్ కాజ్‌వే, వేలుబెల్లి వాగుపై ఒక వైపు చెక్‌డ్యాం.. మరో వైపు లోలెవల్ కాజ్‌వే నిర్మిస్తే ఆయా తండాలకు చెందిన ప్రజల కష్టాలు తీరుతాయి. చెక్‌డ్యాం నిర్మించడంతో ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌కు నీరందడంతో పాటు బ్రిడ్జి వద్ద వరద ఉధృతి తగ్గి రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది.
తండాలను పట్టించుకోవడం లేదు
– అంగోతు శంకర్, రౌతుగూడెం
రౌతుగూడెం, చింతగట్టు, వేపచెట్టు తండాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మా తండాలో కనీస సౌకర్యాలు లే కపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా కొత్తగూడకు వెళ్లాలి. మా తండాకు రోడ్డు సరిగా లేకపోవడంతో 108 వాహనం కూడా రావడం రాదు.
వర్షం పడితే నరకమే
– గుగులోతు భద్రు, చింతగట్టుతండా
నేను రోజు కొత్తగూడకు హమాలీ పనిచేసేందుకు వెళ్తాను. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడకు సైకిల్‌పైనే వస్తాను. వర్షాకాలం వచ్చిందంటే వేలుబెల్లి, బూర్కవాగులు పొంగుతాయి. ఆ సమయంలో మాకు నరకమే. వాగులపై బ్రిడ్జిలు నిర్మిస్తే బాగుంటుంది.
Advertisement
Advertisement