Published
Thu, Sep 8 2016 7:46 PM
| Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
విఘ్ననాథుడికి వీడ్కోలు
మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పూజలందుకున్న విఘ్ననాయకుడి విగ్రహాలు బుధవారం కృష్ణానదిలో నిమజ్జనం కోసం బయలుదేరాయి. ఉదయం ఏకదంతునికి పూజలు చేసిన భక్తులు.. సాయంత్రం ఊరేగింపుగా బ్యారేజీ దిగువున ఉన్న అఫ్రాన్ ప్రాంతానికి తీసుకెళ్లి నమజ్జనం చేశారు. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు మూడు క్రేన్లను అందుబాటులో ఉంచారు. అవాంఛనీయ ఘనలు జరుగకుండా పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు. గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. రాత్రి 8 గంటల వరకు బ్యారేజీ వద్ద 500 పైగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేశారు.