Nimajjanam
-
Ganesh Nimajjanam 2023: హైదరాబాద్‌లో ఘనంగా గణేశ్ శోభాయాత్ర (ఫొటోలు)
-
కన్నుల పండుగగా ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
-
క్రేన్ నెంబర్-4 వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేష్
-
రాష్ట్రాలతో ముడిపడివున్న ఖైరతాబాద్ గణనాధుడు
-
‘ధిక్కరణ’ వేయండి.. చర్యలు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారన్న ఆధారాలుంటే...ధిక్కరణ పిటిషన్ వేయాలని న్యాయవాది వేణుమాధవ్‌ను హైకోర్టు ఆదేశించింది. సరైన ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న కొలనుల్లో మాత్రమే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. పీఓపీతో తయారు చేసే విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ ధూళ్‌పేటకు చెందిన తెలంగాణ గణేశ్‌మూర్తి కళాకా రుల సంక్షేమ సంఘంతో పాటు మరికొందరు హైకోర్టు లో 2022లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ.. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయలేదని, తాత్కాలిక కొలనుల్లో చేశామని తెలిపారు. ఈ క్రమంలో న్యాయవాది వేణుమాధవ్ వాదిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, విచారణను వాయిదా వేసింది. -
ఘనంగా దుర్గామాత నిమజ్జనం (ఫోటోలు)
-
పోయి రా దుర్గమ్మ.. ఘనంగా నిమజ్జనం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఈ ఏడాది నిమజ్జన చెరువులు ఇవే..
సాక్షి, సిటీబ్యూరో: త్వరలో రానున్న వినాయకచవితి పండుగను పురస్కరించుకొని వినాయక విగ్రహాల నిమజ్జనం, తదితర ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. వీలైనంత వరకు ఎక్కడికక్కడే స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. హుస్సేన్ సాగర్‌తో సహ 32 చెరువులు, కుంటల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిమజ్జనాలు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు మిగతా 31 చెరువుల వద్ద విగ్రహాల నిమజ్జనాల కోసం అవసరమైన క్రేన్లు, సిబ్బంది సమకూర్చుకునే పనిలో పడ్డారు. వినాయక విగ్రహాల నిమజ్జనాల కోసం హుస్సేన్‌సాగర్ వద్ద దాదాపు 55 పెద్ద క్రేన్లు (స్టాటిక్) అవసరమని భావిస్తున్నారు. వినాయక ఉత్సవాలకు సంబంధించి తీసుకునే చర్యలు, చేసే ఏర్పాట్లపై నివేదిక సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోనున్నారు. ► హైదరాబాద్‌లో.. నిమజ్జనాల కోసం 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు, జేసీబీలు తదితరమైనవి అందుబాటులో ఉంచుతారు. ► క్రేన్ల అద్దె, నిమజ్జనం చివరి రోజు వరకు వాటిని వినియోగించేందుకు అవసరమైన సిబ్బంది, తదితరమైన వాటికి దాదాపు రూ. 13.50 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ► ప్రధాన రహదారులతోపాటు నిమజ్జనానికి విగ్రహాలు ప్రయాణించే దాదాపు 350 కి.మీ.ల మేర మార్గాల్లో రోడ్లపై ఎలాంటి గుంతలు లేకుండా వాహనాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేయనున్నారు. ► కరోనా నిరోధక చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. నిమజ్జన మార్గాల్లో శానిటైజర్లు,మాస్కు లు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ► ప్రతియేటా మాదిరిగానే తాత్కాలిక టాయ్లెట్లు, తాగునీటి ఏర్పాట్లు, వైద్య కేంద్రాలు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. నిమజ్జన చెరువులు ఇవే.. హుస్సేన్‌సాగర్, కాప్రా, చర్లపల్లి, నల్లచెరువు, నాగోల్, మన్సూరాబాద్ పెద్దచెరువు, సరూర్‌నగర్, మీర్ఆలం ట్యాంక్, పల్లెచెరువు, పత్తికుంట, జంగమ్మెట్, రాజన్నబావి, ఎర్రకుంట, దుర్గంచెరువు, గోపిచెరువు, మల్కం చెరువు, గంగారం పెద్దచెరువు, కొత్తకుంట(ప్రకాశ్‌నగర్), గుర్నాథం చెరువు, కైదమ్మకుంట, రాయసముద్రం, సాకి చెరువు, ఐడీఎల్, సున్నం చెరువు, హస్మత్‌పేట, అంబీరు చెరువు, వెన్నెలగడ్డ, పరికి చెరువు, లింగంచెరువు, కొత్తచెరువు, బండచెరువు, సఫిల్‌గూడ మినీట్యాంక్‌బండ్. పర్యావరణ గణపతికి జై పర్యావరణ గణపతి (మట్టి గణపతి)కి హెచ్ఎండీఏ జైకొట్టింది. ఈమేరకు తొలి మట్టి విగ్రహాన్ని శుక్రవారం స్పెషల్ సీఎస్, హెచ్ఎండీఎ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు అందజేశారు. ఆయన వెంట హెచ్ఎండీఎ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి కూడా ఉన్నారు. ప్రజలను మట్టి విగ్రహాల వైపు మళ్లించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. చదవండి: వైరల్: మంత్రి ట్రై చేశాడు కుదరలే.. పళ్లతో కట్ చేసేశాడు -
ఘనంగా దుర్గామాత నిమజ్జనం
-
రోడ్లపై నిమజ్జనానికి ప్రయత్నం, అడ్డుకుంటున్న పోలీసులు
-
ఘనంగా దుర్గ మాత నిమజ్జనం
-
జూనియర్ ఆర్టిస్ట్ వెకిలి చేష్టలు
సాక్షి, హైదరాబాద్: సామూహిక నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చిన యువతులను సెల్‌ఫోన్ ద్వారా వీడియో రికార్డింగ్ చేసిన వ్యక్తి చర్యలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. సిటీ షీ–టీమ్స్‌కు చిక్కిన ఇతడికి కోర్టు 27 రోజుల జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ (నేరాలు) షికాగోయల్ బుధవారం తెలిపారు. మరో ఇద్దరికి సామాజిక సేవ చేసే శిక్ష విధించగా... యువతిని వేధిస్తున్న మరో వ్యక్తికి జరిమానా విధించినట్లు ఆమె పేర్కొన్నారు. గత నెల 23న సామూహిక గణేష్ నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా షీ–టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఈవ్ టీజర్లకు చెక్ పెట్టేందుకు 100 షీ–టీమ్ బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరించారు. ట్యాంక్‌బండ్ మీద ఉన్న క్రేన్ నెం.3 వద్ద మాటేసిన షీ–టీమ్స్‌కు సుశికాంత్ పాండ దొరికాడు. ఒడిస్సాకు చెందిన ఇతను నగరానికి వలసవచ్చి కుక్‌గా పని చేస్తున్నాడు. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్‌బండ్ పైకి వచ్చిన ఇతను స్మార్ట్‌ఫోన్‌తో యువతులను వారి అనుమతి లేకుండా చిత్రీకరిస్తుండటాన్ని గుర్తించిన షీ–బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. పూర్తి ఆధారాలతో 16వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి సుశికాంత్కు 27 రోజుల జైలు, రూ.250 జరిమానా విధించారు. అదే రోజు ట్యాంక్‌బండ్‌పై యువతులను వెకిలి చేష్టలతో వేధిస్తున్న మీర్‌పేటకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ పి.కృష్ణ, మౌలాలీకి చెందిన బీకే దిలీప్‌లను సైతం పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. వీరికి న్యాయస్థానం రెండు రోజుల పాటు సామాజిక సేవ చేసేలా శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. మరోపక్క ఓ యవతిని ఫోన్ ద్వారా వేధిస్తున్న కుషాయిగూడకు చెందిన వ్యాపారి కె. నాగరాజుకు షీ–టీమ్స్ చెక్ చెప్పాయి. ఇతడికి కోర్టు రూ.250 జరిమానా విధించినట్లు షికా గోయల్ పేర్కొన్నారు. -
5.51 గంటల్లో ఖైరతాబాద్ మహా గణేశ్‌కు బైబై..
ఖెరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతికి అశేష భక్తజనం తుది వీడ్కోలు పలికింది. ఆదివారం ఉదయం వేలాది మంది భక్తులు వెంట రాగా ఉదయం 7.05 గంటలకు మండపం నుంచి బయలుదేరిన శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతి హుస్సేన్‌సాగర్ ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నంబర్ 6 వద్ద మధ్యాహ్నం 12.56 గంటలకు గంగ ఒడికి చేరాడు. 5.51 గంటల పాటు సాగిన శోభాయత్రకు సందర్శకులు, ప్రముఖులు రాకతో సాగర్ ప్రాంగణం కిక్కిరిసింది. యాత్రలో ముందు వినాయకుడి విగ్రహం, వెనుక శ్రీనివాస కల్యాణం సాగాయి. దారిపొడవునా నృత్యాలు, భజనల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పోలీసుల ప్రత్యేక చొరవతో నిమజ్జనం గతేడాదితో పొలిస్తే గంట ముందుగానే ప్రశాంతంగా ముగిసింది. రెండున్నర గంటలపాటు బ్రేక్.. ఉదయం 10.20కు సాగర్‌లోని క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకున్న వినాయకుడిని 40 నిమిషాల పాటు అక్కడే నిలిపారు. అదే సమయంలో అన్ని క్రేన్ల వద్ద ఉన్న పోలీసు సిబ్బంది బడా గణేశ్డిని నిమజ్జనం చేసే క్రేన్ నంబర్ 6 వద్దకు రమ్మని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో మిగతా క్రేన్ల వద్ద నిమజ్జనాలను నిలిపివేశారు. భక్తుల సంఖ్య పెరగడంతో చంటిపిల్లలు ఇబ్బందులు పడ్డారు. మహాగణపతి నిమజ్జన యాత్ర ఇలా.. ⇔ శనివారం రాత్రి 11 గంటలకు భక్తుల దర్శనం నిలిపివేత ⇔ అర్ధరాత్రి 12 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు ప్రారంభం ⇔ 12.50కు ప్రాంగణంలోకి చేరుకున్న క్రేన్ ⇔ 12.55కు ఉత్సవ కమిటీ కలశ పూజ ⇔ 1.46–2.05 గంటల మధ్య మహాగణపతి ప్రాంగణంలోని శ్రీనివాస కల్యాణం మండపాన్ని క్రేన్ సాయంతో వాహనంపై ఉంచారు. ⇔ 3.20కు భారీ విగ్రహాన్ని తాళ్ల సాయంతో పైకెత్తారు ⇔ 3.30కు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ చివరి పూజ ⇔ 3.40కి ట్రాలర్‌పై మహాగణపతి విగ్రహ ⇔ ఆదివారం ఉదయం 7.05కు ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభం ⇔ 8.15కు సెన్సేషన్ థియేటర్ వద్దకు ⇔ 8.35కు రాజ్‌దూత్ చౌరస్తా.. ⇔ 8.48కు టెలిఫోన్ భవన్, 9.05కు ఎక్బాల్ మినార్ చౌరస్తా ⇔ 9.24 సచివాలయం ఓల్డ్‌గేట్ ⇔ 10 గంటలకు తెలుగుతల్లి చౌరస్తాకు మహాగణపతి చేరుకోగానే భారీగా తరలివచ్చిన భక్తులు ⇔ 10.15కు లుంబినీ పార్కు వద్దకు యాత్ర ⇔ 10.20– 11.10 వరకు మహాగణపతి క్రేన్ నెం–4వద్దే దాదాపు 40 నిమిషాలు నిలిపివేశారు. ఈ సమయంలో భక్తుల తాకిడి పెరిగింది. ⇔ 11.25కి ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెం–6 వద్దకు చేరుకున్న విగ్రహం ⇔ 11.42కు మహాగణపతికి తుది పూజలు ప్రారంభం. తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, సీపీ అంజనీకుమార్, మాజీ చింతల రామచంద్రారెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ⇔ 12.35కు కలశ పూజ, భక్తులకు మంత్ర జలం.. ⇔ 12.56కు మహాగణపతి సాగర్ నిమజ్జనం. ట్రాలర్‌కు అందంగా అలంకరణ మహాగణపతి నిమజ్జనానికి తరలించే ఎస్టీసీ ట్రాలర్ వాహనాన్ని ఆదివారం తెల్లవారు జామున కొబ్బరాకులు, అరటి చెట్లు, మామిడి తోరణాలు, బంతిపూలతో అందంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఏకరూప దుస్తుల్లో నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. హైడ్రాలిక్ క్రేన్ సాయంతో నిమజ్జనం ఖైరతాబాద్: శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆధునిక జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన మోడ్రన్ క్రేన్‌ను వినియోగించారు. గతేడాది రవి క్రేన్స్‌కు చెందిన క్రేన్‌తో నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జన సమయంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ ఏడాది రవి క్రేన్స్ రాకపోవడంతో హైడ్రాలిక్ ఆధునిక రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ క్రేన్‌తో నిమజ్జనం చేశారు. హైడ్రాలిక్ మోడ్రన్ క్రేన్.. తడానో కంపెనీ తయారు చేసిన మోడ్రన్ క్రేన్ హైడ్రాలిక్ రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది 400 టన్నుల బరువును అవలీలగా పైకెత్తుతుంది. దీని జాక్ 60 మీటర్ల పైకి లేస్తుంది. 14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉండే క్రేన్‌కు 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైర్ టన్ను బరువుంది. 45 టన్నులున్న మహాగణపతిని సునాయాసంగా సాగర్‌లో నిమజ్జనం చేశారు. సంతోషంగా ఉంది.. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసే భాగ్యం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలిసారి ఈ క్రతువులో పాలుపంచుకున్నా. క్రేన్ ఆపరేటింగ్‌లో పదేళ్ల అనుభవం ఉంది. ఈ హైడ్రాలిక్ క్రేన్‌ను రెండేళ్ల నుంచి ఆపరేట్ చేస్తున్నా. – దేవేందర్ సింగ్, పంజాబ్ -
గణనాథుడికి వీడ్కోలు
విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్) : వైఎస్సార్ సీపీ నాయకుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యాన వాంబే కాలనీలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు సోమవారం వైభవంగా ముగిశాయి. వినాయకుడి విగ్రహం నిమజ్జనం సందర్భంగా తీన్మార్, డప్పు వాయిద్యాలు, భేతాళశెట్టి నృత్యాలతో నిర్వహించిన ఊరేగింపు ఆకట్టుకుంది. తొలుత వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి బొప్పన భవకుమార్, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తదితరులు స్వామివారికి పూజలు చేశారు. ఆకట్టుకున్న వైఎస్సార్, రంగా చిత్రపటాలు వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా చిత్రపటాలను పూలతో అలంకరించి ఊరేగించారు. స్వామి వారితోపాటుగా వైఎస్, రంగా చిత్రపటాలకు స్థానికులు పూజలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు జానారెడ్డి, శ్రీనివాసరెడ్డి, టెక్యం కృష్ణ, గోపి, శివ తదితరులు పాల్గొన్నారు. గీతామందిరం రోడ్డులో... చట్టుగుంట(భవానీపురం) : నగరంలోని చుట్టుగుంట గీతామందిరం రోడ్డులో విజయవాడ ఫైర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 13 రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథునికి సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం కాలనీలో వినాయకుడి విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం కృష్ణలంక సీతమ్మవారి పాదాల వద్ద నిమజ్జనం చేశారు. నిర్వాహకుడు వాసు తదితరులు పాల్గొన్నారు. -
వినాయక నిమజ్జనంలో విషాదం
గీసుకొండ : వినాయక విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి నీట ముని గి మృతిచెందిన సంఘటన మండలంలోని శాయంపేట హవేలిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకా రం.. శాయంపేట హవేలి గ్రామంలో ఈ నెల 14న(బుధవారం) రాత్రి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి గ్రామ శివారులోని చెరువు వద్దకు గ్రామస్తులు ఊరేగింపుగా వెళ్లారు. నిమజ్జన సమయం లో అదే గ్రామాని కి చెందిన చల్లా వేణుగోపాల్(38) చెరువులోకి దిగి నీట మునిగాడు. అయితే అక్కడున్న వారెవరూ గమనించలేదు. ఈ విషయం తెలియని బంధువులు అతడి గురించి పలుచోట్ల వెతికగా ఆచూకీ తెలియలేదు. మృతు డి సోదరుడు శుక్రవారం చెరువు వద్దకు వెళ్లి చూడగా వేణుగోపాల్ మృతదేహం నీటిపై తేలు తూ కనిపించింది. మృతుడి తల్లి కాం తమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై నవీ¯Œ కుమార్ తెలిపారు. -
72 అడుగులు.. 3 గంటలు
-
బైబై.. గణేశా!
చవితి ఉత్సవాల్లో భాగంగా కణేకల్లులో గురువారం వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 అడుగుల ఎత్తు ఉన్న కాణిపాకం వినాయకుడు,15 అడుగుల ఎత్తు ఉన్న సిద్ధేశ్వరస్వామి వినాయకుడు ఆకట్టుకున్నారు. -
72 అడుగులు.. 3 గంటలు
విజయవాడ (మధురానగర్) 72 అడుగుల భారీ విగ్రహ నిమజ్జనం 3 గంటల్లో పూర్తయింది. విజయవాడ, దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకచవితి ఉత్సవాలు గురువారం ముగిశాయి. 72 అడుగుల భారీ విగ్రహాన్ని అక్కడికక్కడే నిమజ్జనం చేశారు. ఉదయం లక్ష్మీగణపతి హోమం, పూర్ణాహుతి జరిగాయి. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం ప్రత్యేక అభిషేకాలు, హారతులు ఇచ్చారు. అనంతరం నవాభిషేకం జరిగింది. ఆ తరువాత సిద్ధిబుద్ధి సమేత కైలాస గణపతి నిమజ్జనం సాయంత్రం 7.15 గంటలకు మొదలుపెట్టారు. బాణసంచా వెలుగు, తీన్మార్, గంగిరెద్దులాటలతో ఉత్సవం జరిగింది. భక్తులు లేక వెలవెల ఆది నుంచి అనేక వివాదాలతో ప్రారంభమైన డూండీ వినాయక ఉత్సవాల్లో గురువారం జరిగిన నిమజ్జన ఉత్సవాలు తూతూమంత్రంగానే ముగిశాయి. వేలాది మంది భక్తులు వస్తారనుకున్న అంచనాలు తారుమారయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, సేవాసమితి గౌరవాధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు నిమజ్జనోత్సవానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. భారీగా తగ్గిన భక్తులు : కోగంటి సత్యం డూండీ గణేశ్‌ను గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని, ఈసారి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని రూ.60లక్షలతో 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాలకు రెండురోజుల ముందే స్థానిక ఎమ్మెల్యే తన అనుచర గణంతో సంగీత కళాశాల ప్రాంగణంలోకి చొరబడి ఉత్సవాలను స్వాధీనం చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ గూండా ప్రవేశంతో ఉత్సవాల్లో భక్తులు తగ్గిపోయారని, గత ఏడాది సుమారు 15లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఈసారి కేవలం లక్షమంది కూడా రాలేదని విచారం వ్యక్తం చేశారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని, నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయన్నారు. సీఎం చంద్రబాబును తాము ఎన్నిమార్లు పిలిచినా రాలేదని, ఈసారి మాత్రం రావడం బాధ కలిగిందని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన అఖిలపక్షానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉత్సవాల్లో వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు పోతిన వెంకట రామారావు, సహాని, ఫణిరాజు, మాజీ డెప్యూటీ మేయర్ సిరిపురపు గ్రిటన్ తదితరులు పాల్గొన్నారు. -
నిమజ్జనంలో అపశ్రుతి
విగ్రహాలు తగిలి తెగిన విద్యుత్ తీగలు బ్రిడ్జిపై వెలగని విద్యుత్ లైట్లు భద్రాచలం టౌన్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి దొర్లింది. విగ్రహాలను తరలిస్తుండగా ఎత్తయిన విగ్రహాలు తగిలి విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో లైట్లు వెలగకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయక విగ్రహాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భద్రాచలానికి తరలిస్తున్నారు. ఇందులో కొందరు భక్తులు బ్రిడ్జిపై నుంచి గోదావరిలో విగ్రహాలను నిమజ్జనం చేయడంతో బ్రిడ్జి కింద ఉన్న 33/11 కేవీ విద్యుత్ లైన్ వైర్లు తెగిపోయాయి. దీంతో బ్రిడ్జిపై విద్యుత్‌కు అంతరాయం కలిగింది. విషయాన్ని స్థానిక విద్యుత్ అధికారులు ట్రాన్స్‌కో ఏడీఈ కోక్యానాయక్కు తెలిపారు. అలాగే పోలీసులకు సైతం సమాచారం అందజేసినట్లు తెలిపారు. కాగా.. పోలీసులు అప్రమత్తంగా ఉండకపోవడం వల్లే ఇలా జరిగిందని వారు తెలిపారు. పోలీసులు బ్రిడ్జిపై నిమజ్జనాలు జరుగకుండా చూసినట్లైతే విద్యుత్‌కు అంతరాయం కలిగి ఉండేది కాదని, ఇప్పుడు విద్యుత్ లైన్ బాగు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలిపారు. త్వరలోనే విద్యుత్ లైన్‌ను సరిచేస్తామని ట్రాన్స్‌కో ఏడీఈ తెలిపారు. -
భక్తా.. మళ్లీవస్తా..
-
శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
– పలువురికి గాయాలు – మునుగోడు మండలం కొంపెల్లిలో ఘటన కొంపెల్లి(మునుగోడు): గణేశ్ శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కొంపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని గౌడ, యాదవ సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా వినాయకుల విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే ఆ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్లపై సౌండ్ సీస్టంమ్‌తో వేర్వేరుగా ఊరేగిస్తూ ఒక కాలనీలో ఎదురు పడ్డారు. మీరు పక్కకు తొలగాలంటే మీరని వాగ్వాదానికి దిగారు. అది తారస్థాయికి చేరుకోవడంతో ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. అయితే ఈ దాడుల్లో గౌడ సంఘానికి చెందిన వీరమళ్ల క్రాంతి కుమార్, పరమేష్, యాదవ సంఘంలోని జూకంటి శ్రీశైలం, దావ చంద్రమ్మ, దాం మహేష్, సైదులకు, అంజమ్మ, చంద్రమ్మకు తీవ్రమైన గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. -
బాలగణం చేసింది.. బొజ్జ గణపతి నిమజ్జనం..
పి.గన్నవరం : నవరాత్ర మహోత్సవాలు ముగిశాయి. ఆలయ ప్రాంగణాల్లో, పందిళ్లలో నిత్యం పూజలందుకున్న పార్వతీతనయుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. మేళతాళాలతో, బాణసంచా ఆర్భాటంతో, ఆటపాటల తుళ్లింతలతో భక్తులు గణపతిని నీటిపట్టులకు తరలించి నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ వేడుకకు నిర్వాహకులు పెద్దలూ, యువకులే. అయితే.. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి శివారు చాకలిపాలెంలో మాత్రం చిన్నారులే ఈ సంరంభానికి సారథ్యం వహించారు. చాకలిపాలేనికి చెందిన న్యాయవాది మొల్లేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు ఏటా వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా జరుపుకొంటారు. వారి ఇళ్లవద్ద పూజలో ఉంచినగణనాథులను చిన్నారులే ఊరేగింపుగా రాజోలు మండలం సోంపల్లికి తరలించి వశిష్ట నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది కూడా 42 గణపయ్య ప్రతిమలను 11 ట్రాలీలపై కార్లు, బైక్‌ల బొమ్మలపై ఉంచి ఊరేగించారు. ఆ ట్రాలీలన్నింటికీ కలిపి ఓ తాడు కట్టి, చిన్నారులే దాన్ని లాగుతూ, ‘గణపతి బొప్పా మోరియా’ అని నినదిస్తూ వశిష్టకు తరలిస్తుంటే.. దారి పొడవునా అందరూ సంభ్రమంగా తిలకించారు. ఊరేగింపులో ఒకవైపున ‘సేవ్ పెట్రోల్’, మరోవైపున ‘బక్రీద్ శుభాకాంక్షలు’ అనే నినాదాలున్న కాగితాలను అతికించారు. -
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు అలంకరించిన వాహనానికి విద్యుత్ లైట్లు అమర్చారు. విద్యుత్ తీగలను సరిచేస్తుండగా వాహనంపైనే ఉన్న గాండ్ల అఖిల్(15) అనే విద్యార్థిపై పడింది. షాక్‌కు గురైన బాలుడిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అఖిల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న బంధువులు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ ఆందోళనకు దిగారు. ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో చేరుకుని సముదాయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ మరణంతో చందపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గణేశుడికి ఘనంగా వీడ్కోలు
– 200కుపైగానే భారీ విగ్రహాలు – మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగిన నిమజ్జనోత్సవం కర్నూలు(హాస్పిటల్): వినాయక చవితి సందర్భంగా కొలువుదీరిన గణనాథులు తొమ్మిదిరోజుల ప్రత్యేక పూజల అనంతరం మంగళవారం గంగమ్మ ఒడి చేరిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వినాయక నిమజ్జనోత్సవం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగింది. కుమ్మరివీధిలోని రాంబొట్ల దేవాలయం వద్ద కొలువుదీరిన వినాయకుడు మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకే చివరి పూజలు అందుకుని నిమజ్జనానికి బయలుదేరాడు. అయితే ముస్లింల బక్రీదు ప్రార్థనల నేపథ్యంలో ఊరేగింపు నెమ్మదిగా సాగింది. కేసీ కెనాల్ వద్ద ఉన్న వినాయక్ఘాట్లో మధ్యాహ్నం 3 గంటలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పూజలు చేసి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు విగ్రహాలు ఘాట్‌కు చేరుకోలేకపోయాయి. ఈసారి అత్యధిక సంఖ్యలో విగ్రహాల వెంట డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి భక్తులు కేరింతలు, కోలాటాలు, నృత్యాల మధ్య ప్రదర్శన నెమ్మదిగా సాగింది. గణేష్ ఉత్సవ సమితి అంచనా మేరకు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. మొత్తం 1200కుపైగా విగ్రహాలుండగా 25 అడుగులకు మించి ఉన్నవి 200కు పైగా ఉన్నాయి. వీటి నిమజ్జనానికి ఎక్కువ సమయం తీసుకోవడం, భారీ క్రేన్లు నాలుగు తెప్పించినా వాటికి గంటకోసారి పావు గంట విరామం ఇవ్వాల్సి ఉండడంతో ఈ ఏడాది నిమజ్జన కార్యక్రమం ఆలస్యమైంది. చివరిగా బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బుధవారపేట శక్తి వినాయకయూత్ వారు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కాస్త ఆలస్యమైనా, వర్షం పడుతున్నా లెక్క చేయకుండా సమితి సభ్యులు, కార్యకర్తలు, భక్తులు కార్యక్రమాన్ని నిర్వఘ్నంగా జరిపించారని గణేశ్ ఉత్సవ సమితి జిల్లా కార్యాధ్యక్షులు కపిలేశ్వరయ్య కొనియాడారు. ఆర్గనైజింగ్ సెక్రటరి ఎం. నాగఫణిశాస్త్రి, నగర కార్య అధ్యక్షుడు కె. క్రిష్ణన్న, ప్రధాన కార్యదర్శి రంగస్వామి, హరీష్‌బాబు, నరసింహవర్మ, భాస్కర్ తదితరుల సేవలను ఆయన అభినందించారు. -
యినాయకుని పెసాదం..బక్రీదు సేమ్యాల పాశం తినాల్సిందే..!
కర్నూలు(కల్చరల్): ఏంవై మోదీనూ!... యియ్యాల శానా లేటుగ వస్తుండవ్. దినాం పొద్దు గాల్గ వస్తుంటివి గద. సూస్తుంటే ఆదాయం బాగా పెరిగినట్టుంది ఈ నడుమ. అందుకే మన్సులతోని మాట్లాడకోకుండ తలకాయ తిప్పుకోని పోతుండవబ్బా! అడిగాడు భద్రయ్య మామ. ఊ! బాగుంది మామా నూ సెప్పేది. దమ్మిడి ఆదాయం లేదు... పైస పురసత్తు లేదు అన్నట్లుంది నాకత. తెల్లారుజామున లేసి పూలబజారుకు పొయ్యి... పూలు కట్టీకట్టీ సేతులు నొస్తే సేతిలోనికి రొండొందలొచ్చేది శానా కటకట అయింది. యిప్పుడు గణేష్ పండుగ వచ్చింది. రోంత మేలు అనిపిస్తుంది. అందుకే వూరికి వచ్చెతలికి మొబ్బైతుంది మామా!... యాదో ఇదింత సీజన్ల నాలుగు రాల్లు మిగిలిచ్చుకోవల్లని ఆశ... చెప్పాడు మోదీన్. ఇంతకీ మీ అబ్బాకొడుకులను మెచ్చుకోవాలవై. మీ నాయన సత్తారు సాబు పూలదండ లేనిది మనూరోల్లు అమ్మవారి కాడికి పోతుండ్లా్య! దసర పండుగ నవరాత్రులు జరిగినన్నాల్లు మీ నాయినే అందరికీ దండలు కుట్టిస్తుండె. ఇప్పుడు ఆ పని నూ నేర్సుకున్నావు... చెప్పాడు భద్రయ్య మామ. అవు మామా!.. మీ తమ్ముడు మా నాయన శానా మంచి న్యాస్తులు గదా. మీ తమ్ముడు ఈరయ్య పీర్ల పండగ జరిగిన పది దినాలు పీర్ల సావిడి కాడే ఉంటుండె. మా నాయిన పీర్లకు పూలు కుట్టియ్యడం, ఈరయ్య మామ పేర్లకు అలంకారాలు సేయడం... బలే ఉండెలే మామ!... చెప్పాడు మోదీన్. అవు మామా!... మన ఊర్ల పీర్ల పండగ, కర్నూల్ల గణేష్ పండగ రొండూ ఒకటే సూడు మామా! సాయిబులు, హిందువులు అందురు కల్సి ఈ రొండు పండుగలు బలే సంబ్రంగ సేస్కుంటరు సూడు. మన ఊర్ల యినాయకునికి పూలదండలు కుట్టి యిచ్చినేది గూడా మోదీనే మామ! చెప్పాడు సిన్నరంగడు. అంత ఎందుకురా! కర్నూల్ల నలభై ఏండ్ల నాడు పీర్ల పండగ బమ్మాండంగ జరుగుతాండె. మేమల్ల కర్నూల్ల పీర్ల సావిళ్ల కాడికి పోయి అల్లాయి గుంతల కాడ సావుశేన్ తొక్కుతాంటిమి. దానిలెక్కనే ఇప్పుడు శానామంది సాయబుల పిల్లగాల్లు మట్టి యినాయకుల్ని సేసి యినాయకసవితి నాటినుండి నిమజ్జనం వరకు శానా సంబరాలు సేస్తున్నారు.. అదేరా మనకు కావాల్సింది. ఎవురి దేవుడైనా సెప్పేది ఒకటే. అందుకే పాతకాలం నాటి నుండి పల్లెల్లో టవున్లో గూడ అన్ని పండగలు అందురు కల్సిమెల్సి సేస్కుంటుండరు... చెప్పాడు భద్రయ్య మామ. మోదీనూ... ఈసారి గూడ నిరుడు లెక్కనే నిమజ్జనం బక్రీదు పండగ కలిసి వచ్చినాయి. ఒకపక్క సేమ్యాల పాశం ఘుమఘుమ, ఇంగోపక్క యినాయకుని పెసాదం ఘుమఘుమ. రొండు కలిపి కొట్రకావేటి రంగ... బలెవుంటదివై ఈసారి.. చెప్పాడు సిన్నరంగడు. వాయబ్బ నువ్వు ఇప్పటినుండే నోరూరిస్తుండవ్ గదరోయ్!... అట్లయితే ఈ పొద్దునుండే కడుపు ఖాలీ పెట్టుకోవల్ల. బలె ఉంటది మామా ఆ పొద్దు. కర్నూల్ల గేరిలో ఇనాయకుడు లేస్తున్నాడని యింటింటికి పెసాదం పంచుతారు. సాయబులు బక్రీదు పండుగకు పక్కింటోల్లకు సేమ్యాల పాశం పంచుతరు. ఈల్లది వాల్లకు, వాల్లది ఈల్లకు దేవుడు ఏం కల్పినడు మామ!... చెప్పాడు మోదీన్. అంతేరా! మన పురాణాల్లో ఏముంటదో ఖురాన్లో అదే... బైబిల్లో అదే ఉంటది. రాముడు రహీము... ఇబ్రహీము అబ్రహాము.. పేర్లుల్లో ఎంత కలివిడితనం ఉందో సూడర్రి... ఇది తెల్సుకోక కొంతమంది నాదే గొప్ప నాదే గొప్ప అంటుంటరు. అందరి దేవుండ్లూ గొప్పనే. ఈడనే సూస్తే తెలుస్తుంది కదరా! మన వూర్లో యాప మానుకు గ్యారమీలు సేసి జెండా లెక్కిస్తరు. అదే యాప మానుకు మనూర్లో దస్ర నాడు, సంకురాత్రి నాడు కుంకుమ పూసి పూజలు సేస్తరు. అందరికీ యాపమాను నీడనే... తల్లిదండ్రి లెక్క ఆదుకుంటది... చెప్పాడు భద్రయ్య మామ! అంతెందుకు మామా! మా పెద్ద నాయనోల్ల యింట్ల పిలగాండ్లు బత్కడం లేదని దర్గకు పోయి దస్తగిరి సామికి మొక్కుకున్నరంట. అప్పుడు నుండి పుట్టిన పిల్లలు బత్కపట్టినరంట. ఇంగ సూస్కో లైనుగ వాల్లింట్లో పుట్టిన పిల్లలకు పెద్ద దరగయ్య, సిన్న దర్గయ్య, పెద్ద దస్తగిరి, సిన్న దస్తగిరి, నడిపి దస్తగిరి... యిట్లా మొదులుపెట్టినారు. అంతే మామ! మనూర్లో అందురు ఇకింటి పిల్లల్లెక్కనే ఉంటరు. ఈ ఓట్లకొచ్చేతోల్లే సూడు వాల్ల నడ్మ ఈల్ల నడ్మ కొండి పెట్టి గెల్కుతరు. అయినా మన వూరోల్లు మాత్తరం ఏకంగానే ఉంటరు మామ!.. సెప్పాడు సిన్నరంగడు. -
నిమజ్జనోత్సవానికి ముందుచూపు ‘కరువు’
వెలవెలబోతున్న మానకొండూర్ చెరువు కాకతీయ కాలువ ద్వారా నింపేందుకు చర్యలు పూర్తిస్థాయిలో నిండాలంటే 15రోజులు గతేడాది అసంపూర్తిగా నిమజ్జనం మానకొండూర్ : వినాయక నిమజ్జనోత్సవానికి అధికారుల్లో ముందుచూపు కరువైంది. వర్షాభావ పరిస్థితులతో మానకొండూర్ పెద్ద చెరువు వెలవెలబోతోంది. మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లాకేంద్రంతోపాటు చుట్టుపక్క గ్రామాల్లో నెలకొల్పిన వినాయక విగ్రహాలను ఈ చెరువులోనే నిమజ్జనం చేస్తుంటారు. చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండడంతో నిమజ్జనానికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఎల్ఎండీ నుంచి కాకతీయ కాలువ ద్వారా మానకొండూర్ చెరువును నింపుతామని అధికారులు హామీ ఇస్తున్నా.. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అధికారులు చెప్పినట్లు కాకతీయ కాలువ ద్వారా నీరు విడుదల చేసినా చెరువు పూర్తిస్థాయిలో నిండాలంటే సుమారు 15 రోజులు పడుతుంది. మరోవైపు నిమజ్జనోత్సవానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో చెరువు నిండాలంటే సాధ్యం కాదు. ఒకవేళ శుక్రవారం ఉదయం నుంచి నీరు వదిలినా.. నిమజ్జనం సమయానికి ఒకటి, రెండు ఫీట్ల మేర తప్ప ఎక్కువ పెరగదు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనప్పటినుంచే అధికారులు మానకొండూర్ చెరువును నింపే పనులు చేస్తే బావుండేదని మండపాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. డెడ్ స్టోరేజీలో నీరు మానకొండూర్ పెద్ద చెరువు విస్తీర్ణం 375 ఎకరాలు. 680 ఎకరాల ఆయకట్టు. 18 ఫీట్ల మేర నీరు నిల్వ చేయెుచ్చు. కానీ.. వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం రెండుఫీట్ల (డెడ్‌స్టోరేజీ) నీరుంది. ఈ చెరువును నింపేందుకు కాకతీయ కాలువ డీబీఎం 2, 2సీ, డీబీఎం 3 ద్వారా నీటిని వదిలేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ పనులు రెండురోజులుగా సాగుతూనే ఉన్నాయి. కాకతీయ కాలువలో ఇసుకబస్తాలను అడ్డుగా వేసి నీటిని మళ్లించే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యేదెన్నడూ.. విగ్రహాలను నిమజ్జనం చేసేదెలా..? అని నిర్వాహకులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు చెరువుకట్టపై ఐదు భారీ క్రేన్ల సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చేయాలని కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. భారీ విగ్రహాలకు ఇబ్బందే.. జిల్లాకేంద్రం నుంచి ఏటా వందలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం ఇక్కడికే తీసుకొస్తుంటారు. భారీ విగ్రహాలైనా.. ఈ చెరువుకు రావాల్సిందే. యేటా ఏడువందలకు పైగా భారీ వినాయక విగ్రహాలు, వందల సంఖ్యలో చిన్న పాటి విగ్రహాలు నిమజ్జనం చేస్తుంటారు. నాలుగేళ్లుగా ఆశించినస్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువు వెలవెలబోతోంది. గతేడాది వినాయక నిమజ్జనానికి చెరువులో చుక్కనీరు లేకపోవడంతో అధికారులు ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా నింపే ప్రయత్నం చేశారు. నిమజ్జనం సమయానికి రెండు, మూడు ఫీట్ల మేర మాత్రమే నీరు చేరింది. ఫలితంగా కొన్ని విగ్రహాలను చెరువుకట్టపైనే వేయాల్సి వచ్చింది. కొన్ని విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం కాకపోవడంతో ఫైరింజన్ సహాయంతో విగ్రహాలపై నీళ్లు చల్లించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. -
విఘ్ననాథుడికి వీడ్కోలు
మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పూజలందుకున్న విఘ్ననాయకుడి విగ్రహాలు బుధవారం కృష్ణానదిలో నిమజ్జనం కోసం బయలుదేరాయి. ఉదయం ఏకదంతునికి పూజలు చేసిన భక్తులు.. సాయంత్రం ఊరేగింపుగా బ్యారేజీ దిగువున ఉన్న అఫ్రాన్ ప్రాంతానికి తీసుకెళ్లి నమజ్జనం చేశారు. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు మూడు క్రేన్లను అందుబాటులో ఉంచారు. అవాంఛనీయ ఘనలు జరుగకుండా పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు. గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. రాత్రి 8 గంటల వరకు బ్యారేజీ వద్ద 500 పైగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేశారు. – విజయవాడ కల్చరల్ -
నేడే నిమజ్జనం
⇒ సగానికిపైగా హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం ⇒ నగరం చుట్టూ మరో 24 చెరువుల వద్ద ఏర్పాట్లు ⇒ ప్రతి 3 కి.మీ.కు ఒక గణేశ్ యాక్షన్ టీం ⇒ 400 ప్రత్యేక బస్సులు, 8 ఎంఎంటీఎస్ రైళ్లు ⇒ శోభాయాత్రలో పాల్గొనే మొత్తం విగ్రహాలు 60,000 ⇒ బందోబస్తు విధుల్లో పోలీసులు 30,000 ⇒ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య (సుమారుగా) 2,500 సాక్షి, హైదరాబాద్: పదకొండు రోజులపాటు భక్తకోటి పూజలందుకున్న విఘ్నేశ్వరుడు నేడు నిమజ్జనానికి కదలనున్నాడు! ఆదివారం జరిగే నిమజ్జన మహాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగాలన్నీ రంగంలోకి దిగాయి. జీహెచ్ఎంసీ, పోలీసు, రవాణా, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖ, జలమండలి, హెచ్ఎండీఏ, ఆర్టీసీ తదితర విభాగాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘా కెమెరాలు, గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈసారి షీటీమ్స్ సైతం రంగంలోకి దిగాయి. భక్తులతో కిక్కిరిసిపోనున్న హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. శనివారం పోలీసులు ఖైరతాబాద్, బాలాపూర్ మహాగణపతుల నిమజ్జనానికి సంబంధించిన ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ ఏడాది సుమారు 60 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయి. వీటిలో 50 శాతానికిపైగా హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం కానున్నాయి. ఈసారి బాలాపూర్ శోభాయాత్రతో నిమిత్తం లేకుండానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తారు. మిగతా విగ్రహాలను నగరం చుట్టూ ఉన్న 24 చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మీరాలం ట్యాంకు, పల్లెచెరువు, పత్తికుంట చెరువు, దుర్గం చెరువు,సఫిల్‌గూడ చెరువు, రామసముద్రం, ఐడీఎల్ చెరువు, సున్నం చెరువుల వద్ద నిమజ్జన వేడుకలు జరుగనున్నాయి. జీహెచ్ఎంసీ సన్నద్ధం ట్యాంక్‌బండ్‌తోపాటు మిగతా చెరువుల వద్ద నిమజ్జనం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. పారిశుధ్య పనుల కోసం 545 మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 5,793 మంది కార్మికులు విధులు నిర్వహించనున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు, 21 మంది కార్మికులతో ‘గణేశ్ యాక్షన్ టీమ్’ ఏర్పాటు చేశారు. ప్రతి 3 నుంచి 4 కిలోమీటర్లకు ఒక టీమ్ పని చేస్తుంది. మొత్తం 180 బృందాలు 24 గంటల పాటు పారిశుధ్య పనుల్లో నిమగ్నమై ఉంటాయి. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు అదనంగా కొన్ని వాహనాలను సైతం అద్దెకు తీసుకున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. శోభాయాత్ర సాగే మార్గంలో రూ.13.55 కోట్లతో ఇప్పటికే రహదారులు మరమ్మతు చేశారు. రూ.39 లక్షలతో 23,353 తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ మార్గంలో 21 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గంలో మరో 21 క్రేన్లను నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లను కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. 30 వేల మంది పోలీసులతో భద్రత జంట పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 30 వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2,500కు పైగా నిఘా కెమెరాలు, మరో 10 మౌంటెడ్ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. సుమారు 150 షీటీమ్స్ రంగంలోకి దిగాయి. 60 బాంబు నిర్వీర్య బృందాలను మోహరించారు. 60 స్నిఫర్డాగ్స్ను కూడా రంగంలోకి దించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మొత్తం నిమజ్జన యాత్రను ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ‘భగవంతుని సేవలో భక్తులు.. భక్తుల సేవలో పోలీసులు’ అనే నినాదంతో పోలీసుల బలగాలు రంగంలోకి దిగాయి. 120 పెట్రోలింగ్ వాహనాలు, 17 ఇంటర్సెప్టర్లు, 88 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. ఘాట్ల వద్ద మరో 50 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. 400 ప్రత్యేక బస్సులు: ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు తరలి వచ్చేవారి కోసం ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరం నలుమూలల నుంచి బస్సులు లక్డీకాఫూల్, ఖైరతాబాద్, ఇందిరాపార్కుకు రాకపోకలు సాగిస్తాయి. నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు ప్రయాణికులకు బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఈడీ పురుషోత్తం నాయక్ తెలిపారు.దక్షిణ మధ్య రైల్వే 8 ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు ప్రతి అరగంటకు ఒకటి చొప్పున నాంపల్లి-సికింద్రాబాద్, ఫలక్‌నుమా-సికింద్రాబాద్, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో తిరుగుతాయి. ఏర్పాట్లు పూర్తి చేశాం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గణేశ్ యాక్షన్ టీమ్‌లు 24 గంటల పాటు విధి నిర్వహణలో ఉంటాయి. రహదారులు, వీధిదీపాల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నాం.ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. - సోమేశ్‌కుమార్, జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ పోలీసులు క్షణాల్లో చేరుకుంటారు బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 400 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసులు క్షణాల్లో చేరుకొనే విధంగా ఏర్పాట్లు చేశాం. - మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ -
ఈ ఏడాదీ సాగర్ లోనే నిమజ్జనాలు..
హైదరాబాద్ : వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టు తీర్పిచ్చింది. ఈ ఏడాది కూడా హుస్సేన్‌సాగర్ లోనే నిమజ్జనాలు చేసుకోవచ్చని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించింది. వచ్చే ఏడాది నుంచి వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్.. వినాయక నిమజ్జనాలు ఇక నుంచి ఇందిరాపార్కులో చేస్తామని, అందులో భారీ చెరువు నిర్మిస్తామని పేర్కొన్న విషయం విదితమే. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. తాజాగా హైకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది గణనాథుల నిమజ్జనం హుస్సేన్‌సాగర్ లోనే నిర్వహించనున్నారు. -
ఏర్పాట్లు భేష్: ఆంధ్రా పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నిమజ్జనం కోసం ఈ సారి జంట పోలీసు కమిషనరేట్లలో విధులు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 10 వేలకుపైగా సిబ్బంది, అధికారులు వచ్చారు. వీరికి ఏ లోటు రాకుండా భోజనం, మంచినీరు, టిఫిన్లు, బస, మరుగుదొడ్ల ఏర్పాట్లను పోలీసు బాస్‌లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌ల ఆదేశాల మేరకు అధికారులు దగ్గరుండి చూసుకున్నారు. ఈ ఏర్పాట్లను చూసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నివ్వెరపోయారు. ఇంత మంచి ఏర్పాటు చేస్తారని తాము వూహించలేదని, బందోబస్తు అంటే మరోసారి పరుగెత్తుకుంటూ వస్తామని తిరుపతికి చెందిన ఓ ఎస్ఐ తన అభిప్రాయాన్ని సాక్షితో పంచుకున్నారు. సైబరాబాద్, హైదరాబాద్‌లో విధులు నిర్వహించిన ఏపీ పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టైం టూ టైం వారి మంచిచెడ్డలు చూసుకోవడంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఏదైనా సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు బందోబస్తుకు తెలంగాణ పోలీసులు వస్తే తాము కూడా ఇదే రకంగా సౌకర్యాలు, మర్యాదలు చేస్తామని వారు హామీ ఇవ్వడం గమనార్హం. -
విఘ్నేశా.. వీడ్కోలు
* కన్నుల పండువగా సాగిన నిమ‘జ్జన’ ఘట్టం * తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఉత్సవం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారి ఉత్సవం.. అరవై అడుగుల మహా విశ్వరూప గణ(ఘన)పతి.. తదితర ప్రత్యేకతల నేపథ్యంలో, పదకొండు రోజుల పాటు అశేష భక్తజనుల విశేష పూజల అనంతరం సామూహిక గణేశ్ నిమజ్జనయాత్ర సరికొత్త దృశ్యాన్ని ఆవిష్కరించింది. సోమవారం జరిగిన శోభాయాత్ర కన్నుల పండువలా ముందుకు సాగింది. భక్తజనం ముక్తకంఠంతో ‘జైబోలో గణేశ్ మహరాజ్’ అంటూ బాలాపూర్ నుంచి వినాయకసాగర్ వరకు నిర్వహించిన ఆధ్యాత్మిక శోభాయాత్ర సరికొత్త అందాన్ని చిత్రించింది. మునుపటిలా ఉరుకులు పరుగులు లేకుండా యాత్ర కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. నెమ్మదిగా ముందుకు సాగింది. దీంతో, సాయంత్రం ఆరుగంటల వరకూ వినాయకసాగర్‌కు చెప్పుకోదగ్గ సంఖ్యలో గణనాథులు రాలేదు. ప్రపంచం లోనే అతి పెద్ద వినాయకునిగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణపయ్యపై ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురుస్తుందని ప్రకటించడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు ఎందరో ఎదురు చూశారు. దాంతో పాటు భారీ వినాయకుణ్ని మళ్లీ చూడలేమనే తలంపుతో ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు జనం పోటెత్తారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన దృశ్యాల్ని తిలకించేందుకు నేల ఈనిందా.. అన్నట్లు ప్రజలు భారీగా అక్కడకు చేరుకున్నారు. బహు రూపాల్లో బొజ్జ గణపయ్యలు విభిన్న రూపాల్లోని గణేశుడి ప్రతిమలు.. పండ్లు, పూలతో అలంకరించిన నిమజ్జన వాహనాలు.. యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పహిల్వాన్ ఆకృతిలోని వినాయకునితోపాటు బాలాజీ, షిర్డీ సాయిబాబా, పార్వతీపరమేశ్వరులతో కూడిన ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. డీజే సంగీతానికి అనుగుణంగా యువతీ యువకులు చేసిన నృత్యాలు శోభాయాత్రలో ఉత్సాహం నింపాయి. నిమజ్జనయాత్రలోని ముఖ్యకేంద్రమైన మొజాంజాహీ మార్కెట్‌కు శోభాయాత్ర చేరుకునేటప్పటికి దాదాపు రాత్రి 7 గంటలైంది. దాంతో విగ్రహాలు వినాయకసాగర్‌కు వచ్చేందుకు మరింత సమయం పట్టింది. వివిధ మార్గాల నుంచి.. నగరంలోని వివిధ మార్గాల నుంచి బయల్దేరిన వినాయకుల విగ్రహాలు కూడా రాత్రి 8 గంటల తర్వాతే హుస్సేన్‌సాగర్‌కు చేరుకున్నాయి. ‘గణపతి బొప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్‌కీ జై..’ తదితర నినాదాలతోపాటు బాజా భజంత్రీలు, మేళతాళాలు, కళాకారుల నృత్యాలతో నగర వీధులన్నీ పండుగ హోరులో మునిగాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఆయా ప్రాంతాల్లో వేదికలపై నుంచి పూల తో గణనాయకులకు స్వాగతం పలికారు. పలుచోట్ల భక్తులకు మంచినీరు, ప్రసాదం పంపిణీ చేశారు. ఆయాప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే యాత్ర వేగంగా ముందుకు సాగింది. పలు ప్రాంతాల్లో నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌తోపాటు కాప్రా చెరువు, సరూర్‌నగర్ చెరువు, రాజన్నబావి, మీరాలంట్యాంక్, పల్లె చెరువు, పత్తికుంట చెరువు, దుర్గం చెరువు, మల్కం చెరువు, గోపీనగర్ చెరువు, పెద్ద చెరువు(గంగారం), గురునాథం చెరువు (జేపీనగర్), కైదమ్మకుంట (హఫీజ్‌పేట), ఈర్ల చెరువు, రాయసముద్రం చెరువు (రామచంద్రాపురం), సాకి చెరువు (పటాన్చెరు), ఐడీఎల్ ట్యాంక్ 16, ప్రగతినగర్ చెరువు, హస్మత్‌పేట చెరువు, సున్నం చెరువు, పరికి చెరువు, వెన్నెలగడ్డ చెరువు, సూరారం చెరువు, కొత్తచెరువు (అల్వాల్‌లేక్), సఫిల్‌గూడ చెరువుల వద్ద కూడా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ నుంచి.. నిమజ్జనం తీరును హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు హెలికాప్టర్ నుంచి వీక్షించారు. నిమజ్జన యాత్ర మార్గాల్ని వీక్షించిన వారు పరిస్థితి ప్రశాంతంగా ఉందని రూఢి చేసుకున్నారు. అపశ్రుతి.. భక్తియాత్ర సజావుగానే సాగినప్పటికీ, ఆయా ప్రాంతాల్లో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. గణేశునిపై పూలవర్షం కురిపిస్తారని తెలిసి ఆ సుందర దృశ్యాన్ని తిలకించేందుకని రాయదుర్గం నుంచి ఆటోలో బయలుదేరిన కుటుంబం ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొనడంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అఫ్జల్‌గంజ్ నుంచి నిమజ్జనానికి బయలుదేరిన ట్రాలీఆటో మొజాంజాహీ మార్కెట్ వద్ద ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. ఆటోలో మొత్తం 15 మంది ఉండగా, వారిలోఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గణనాథుడిని వాహనంలో ఎక్కిస్తుండగా గోషామహాల్ ప్రాంతానికి చెందిన సాయి(25) అనే వ్యక్తి చూపుడు వేలు తెగిపోయింది. మరో ఘటనలో గణపతిని వాహనంలోకి ఎక్కిస్తుండగా, అదుపుతప్పి కిందపడి మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇసుకేస్తే రాలనంతగా.. ఈ సంవత్సరం అత్యంత ఎత్తుకు ఎదిగిన గణనాథుడు వచ్చే ఏడాది నుంచి ఎత్తు తగ్గనుండటంతో గ్రేటర్ ప్రజలే కాక పొరుగుజిల్లాల నుంచీ భారీసంఖ్యలో ప్రజలు నగరానికి చేరుకున్నారు. దాదాపు 15 లక్షల మంది ఈ అపురూప వేడుకను తిలకించినట్లు అంచనా. మొజాంజాహీ మార్కెట్, ట్యాంక్బండ్లు ఇసుకేస్తే రాలని జనాన్ని తలపిస్తూ మహోత్సవానికి ప్రత్యక్షసాక్షులుగా నిలిచాయి. యాత్ర సాగిందిలా.. బాలాపూర్‌లో వేలంపాట అనంతరం ఉదయం 11.15 గంటలకు గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా.. అడుగడుగునా నృత్యాలు.. డప్పుమోతలు.. కేరింత లతో పండుగ సంబరంతో గణనాథుల రథాలు ముందుకు కదిలాయి. పాతబస్తీ పరిధిలోని విగ్రహాలు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బయల్దేరి చార్మినార్‌కు చేరుకునేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమైంది. బాలాపూర్ విగ్రహం బార్కాస్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, అలియాబాద్, లాల్‌దర్వాజ, శాలిబండ మీదుగా చార్మినార్‌కు చేరుకునే సరికి సాయంత్రం 6.30 గంటలు దాటింది. అడుగడుగునా నిఘా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, తదితర ప్రభుత్వ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయడంతో యాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఊరేగింపులో గణేశ ప్రతివులు కలిసే చోట పోలీసులు అప్రవుత్తంగా వ్యవహరించారు. యాత్ర పొడవునా వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏ మార్గంలోనైతే పరిస్థితి విషమంగా మారనుందో ముందస్తుగానే గుర్తించి, ట్రాఫిక్‌ను మళ్లించే చర్యలు చేపట్టడంతో యాత్ర సజావుగా ముందుకు సాగింది. 11న ప్రసాదం పంపిణీ 2 వేల కిలోలు లడ్డూ దాతకు.. 3 వేల కిలోలు భక్తులకు హైదరాబాద్: కైలాస విశ్వరూప మహాగణపతికి నైవేద్యంగా సమర్పించిన 5 టన్నుల బరువైన భారీ లడ్డూను ఈ నెల 11న భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సోమవారం రాత్రి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ లడ్డూలో రెండు వేల కిలోల్ని దాత (తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు)కు అందజేయనున్నారు. మిగిలిన 3 వేల కిలోల ప్రసాదాన్ని భక్తులకు పంచనున్నారు. పల్లెల్లో పంచుతా... మహాగణపతికి ప్రసాదాన్ని అందించే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు కేటాయించిన రెండు వేల కిలోల లడ్డూను 50 నుంచి 60 గ్రాముల చొప్పున ప్యాకెట్లుగా తయారు చేస్తా. మా జిల్లాలోని(తూర్పుగోదావరి) వివిధ గ్రామాల్లో భక్తులకు పంపిణీ చేస్తా. -లడ్డూ దాత మల్లిబాబు -
గంగమ్మ ఒడిలోకి గణనాథులు
-
ట్యాంక్‌బండ్ వద్దకు గణేష్ విగ్రహాలు
-
జబర్దస్త్ టీంతో చిట్‌చాట్ Part 4
-
జబర్దస్త్ టీంతో చిట్‌చాట్ Part 3
-
జబర్దస్త్ టీంతో చిట్‌చాట్ Part 5
-
20న ప్రజాప్రతినిధుల ధర్నా: శోభానాగిరెడ్డి
-
జబర్దస్త్ టీంతో చిట్‌చాట్ Part 2
-
జబర్దస్త్ టీంతో చిట్‌చాట్ Part 1
-
నిమజ్జనోత్సాహం, మహాగణపతి నిమజ్జనం
-
శివన్న స్వరహేళ
-
గాయని గాయత్రి,జయశ్రీ తో స్పెషల్ ఎడిషన్
-
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లు