గణనాథుడికి వీడ్కోలు
గణనాథుడికి వీడ్కోలు
Published Mon, Sep 19 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్) : వైఎస్సార్ సీపీ నాయకుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యాన వాంబే కాలనీలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు సోమవారం వైభవంగా ముగిశాయి. వినాయకుడి విగ్రహం నిమజ్జనం సందర్భంగా తీన్‌మార్, డప్పు వాయిద్యాలు, భేతాళశెట్టి నృత్యాలతో నిర్వహించిన ఊరేగింపు ఆకట్టుకుంది. తొలుత వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి బొప్పన భవకుమార్, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తదితరులు స్వామివారికి పూజలు చేశారు.
ఆకట్టుకున్న వైఎస్సార్, రంగా చిత్రపటాలు
వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా చిత్రపటాలను పూలతో అలంకరించి ఊరేగించారు. స్వామి వారితోపాటుగా వైఎస్, రంగా చిత్రపటాలకు స్థానికులు పూజలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు జానారెడ్డి, శ్రీనివాసరెడ్డి, టెక్యం కృష్ణ, గోపి, శివ తదితరులు పాల్గొన్నారు.
గీతామందిరం రోడ్డులో...
చట్టుగుంట(భవానీపురం) : నగరంలోని చుట్టుగుంట గీతామందిరం రోడ్డులో విజయవాడ ఫైర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 13 రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథునికి సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం కాలనీలో వినాయకుడి విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం కృష్ణలంక సీతమ్మవారి పాదాల వద్ద నిమజ్జనం చేశారు. నిర్వాహకుడు వాసు తదితరులు పాల్గొన్నారు.
Advertisement