గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి | bad news in ganesh nimajjanam | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి

Published Wed, Sep 14 2016 10:40 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

అఖిల్‌ - Sakshi

అఖిల్‌

  • విద్యుత్‌ షాక్‌తో విద్యార్థి మృతి
  • పెద్దపల్లిరూరల్‌ : పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామంలో గణేష్‌ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు అలంకరించిన వాహనానికి విద్యుత్‌ లైట్లు అమర్చారు. విద్యుత్‌ తీగలను సరిచేస్తుండగా వాహనంపైనే ఉన్న గాండ్ల అఖిల్‌(15) అనే విద్యార్థిపై పడింది. షాక్‌కు గురైన బాలుడిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అఖిల్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న బంధువులు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ ఆందోళనకు దిగారు. ఎస్సై శ్రీనివాస్‌ తన సిబ్బందితో చేరుకుని సముదాయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్‌ మరణంతో చందపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement