శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ | Two incedents in Ganesh nimajjanam | Sakshi
Sakshi News home page

శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Published Wed, Sep 14 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

– పలువురికి గాయాలు
– మునుగోడు మండలం కొంపెల్లిలో ఘటన
కొంపెల్లి(మునుగోడు):
గణేశ్‌ శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కొంపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది.  బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని గౌడ, యాదవ సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా వినాయకుల విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే ఆ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్లపై సౌండ్‌ సీస్టంమ్‌తో వేర్వేరుగా ఊరేగిస్తూ ఒక కాలనీలో ఎదురు పడ్డారు. మీరు పక్కకు తొలగాలంటే మీరని వాగ్వాదానికి దిగారు. అది తారస్థాయికి చేరుకోవడంతో ఇరువర్గాలు కర్రలతో దాడులు  చేసుకున్నారు. అయితే ఈ దాడుల్లో గౌడ సంఘానికి చెందిన వీరమళ్ల క్రాంతి కుమార్, పరమేష్, యాదవ సంఘంలోని జూకంటి శ్రీశైలం, దావ చంద్రమ్మ, దాం మహేష్, సైదులకు, అంజమ్మ, చంద్రమ్మకు తీవ్రమైన గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇరువర్గాల వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement