ఏర్పాట్లు భేష్: ఆంధ్రా పోలీసులు | AP Police participate in Ganesh immersion in Hyderabad | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లు భేష్: ఆంధ్రా పోలీసులు

Published Tue, Sep 9 2014 1:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

AP Police participate in Ganesh immersion in Hyderabad

సాక్షి, హైదరాబాద్: నిమజ్జనం కోసం ఈ సారి జంట పోలీసు కమిషనరేట్లలో విధులు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 10 వేలకుపైగా సిబ్బంది, అధికారులు వచ్చారు. వీరికి ఏ లోటు రాకుండా భోజనం, మంచినీరు, టిఫిన్లు, బస, మరుగుదొడ్ల ఏర్పాట్లను పోలీసు బాస్‌లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌ల ఆదేశాల మేరకు అధికారులు దగ్గరుండి చూసుకున్నారు. ఈ ఏర్పాట్లను చూసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నివ్వెరపోయారు.

ఇంత మంచి ఏర్పాటు చేస్తారని తాము వూహించలేదని, బందోబస్తు అంటే మరోసారి పరుగెత్తుకుంటూ వస్తామని తిరుపతికి చెందిన ఓ ఎస్‌ఐ తన అభిప్రాయాన్ని సాక్షితో పంచుకున్నారు. సైబరాబాద్, హైదరాబాద్‌లో విధులు నిర్వహించిన ఏపీ పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టైం టూ టైం వారి మంచిచెడ్డలు చూసుకోవడంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఏదైనా సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు బందోబస్తుకు తెలంగాణ పోలీసులు వస్తే తాము కూడా ఇదే రకంగా సౌకర్యాలు, మర్యాదలు చేస్తామని వారు హామీ ఇవ్వడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement