బ్రిడ్జి కింద తెగిపోయి ఉన్న విద్యుత్ వైర్లు
- విగ్రహాలు తగిలి తెగిన విద్యుత్ తీగలు
- బ్రిడ్జిపై వెలగని విద్యుత్ లైట్లు
భద్రాచలం టౌన్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి దొర్లింది. విగ్రహాలను తరలిస్తుండగా ఎత్తయిన విగ్రహాలు తగిలి విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో లైట్లు వెలగకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయక విగ్రహాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భద్రాచలానికి తరలిస్తున్నారు. ఇందులో కొందరు భక్తులు బ్రిడ్జిపై నుంచి గోదావరిలో విగ్రహాలను నిమజ్జనం చేయడంతో బ్రిడ్జి కింద ఉన్న 33/11 కేవీ విద్యుత్ లైన్ వైర్లు తెగిపోయాయి. దీంతో బ్రిడ్జిపై విద్యుత్‌కు అంతరాయం కలిగింది. విషయాన్ని స్థానిక విద్యుత్ అధికారులు ట్రాన్స్‌కో ఏడీఈ కోక్యానాయక్‌కు తెలిపారు. అలాగే పోలీసులకు సైతం సమాచారం అందజేసినట్లు తెలిపారు. కాగా.. పోలీసులు అప్రమత్తంగా ఉండకపోవడం వల్లే ఇలా జరిగిందని వారు తెలిపారు. పోలీసులు బ్రిడ్జిపై నిమజ్జనాలు జరుగకుండా చూసినట్లైతే విద్యుత్‌కు అంతరాయం కలిగి ఉండేది కాదని, ఇప్పుడు విద్యుత్ లైన్ బాగు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలిపారు. త్వరలోనే విద్యుత్ లైన్‌ను సరిచేస్తామని ట్రాన్స్‌కో ఏడీఈ తెలిపారు.