గోపాల్‌రెడ్డి విజయానికి పిలుపు
కోవెలకుంట్ల: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని నిరుద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ దేవరాజు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. 26వేలకు పైగా గ్రూప్ -1,2 పోస్టులు ఖాళీగా ఉండగా 980 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. 1.60 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 8వేల పోస్టులు భర్తీ చేశారని, మిగిలిన శాఖల్లో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదన్నారు. నెలకు రూ. 2వేలు నిరుద్యోగ భృతి హామీని గాలికి వదిలేశారని, నిరుద్యోగులకు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి నిరుద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ సభ్యులు దస్తగిరి, బాషా, నాగేశ్వరరావు పాల్గొన్నారు.