కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత
కాజీపేట : కబేళాకు తరలిస్తున్న 55 పశువులను గో సంరక్షణ సమితి సభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎల్.రమేష్‌కుమార్ తెలిపారు. విజయవాడ నుంచి కాజీపేట మీదుగా పశువులను కబేళాలకు తరలిస్తున్నారని గో సంరక్షణ సమితి సభ్యులు 100 నెంబర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారని, దీంతో బాపూజీనగర్ చౌరస్తా వద్ద కంటైనర్ వాహనంలో హైదరాబాద్‌కు తరలుతున్న పశువులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కాజీపేట పీఎస్‌లో కేసు నమోదు చేసి పశువులను ధర్మసాగర్ మండలం ముప్పారంలోని బృందావనం గోసంరక్షణశాలకు తరలించారు.