మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగురోడ్డుపై శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది.
మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగురోడ్డుపై శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఅంబర్ నుంచి కేరళ వెళ్తున్న ఓ స్విఫ్ట్ కారు టైరు అకస్మాత్తుగా పంక్చరైంది. అదే సమయంలో ఇంకో టైరు కూడా ఊడిపోవడంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తుక్కుగూడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు కేరళకు చెందిన వారిగా గుర్తించారు.