కారు, ట్రాక్టర్ ఢీ
నెల్లూరు(క్రైమ్): కారు – ట్రాక్టర్ ఢీకొన్న ఘటన గురువారం డైకస్‌రోడ్డు సెంటర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కొత్తూరు వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్, డైకస్ రోడ్డు నుంచి కొత్తూరు వైపు వెళ్తున్న కారు పాత పొగాకు ఫ్యాక్టరీ వద్ద ఢీకొన్నాయి. ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతినగా, ట్రాక్టర్ ఇంజిన్ ముందు భాగంతో పాటు టైర్లకు ఉన్న రాడ్ విరిగిపోయింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ట్రాఫిక్ స్తంభించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.