తల్లి సహా ఐదుగురు పిల్లల మృతదేహాలు లభ్యం | car washed away in flood water bodies found at nizamabad | Sakshi
Sakshi News home page

తల్లి సహా ఐదుగురు పిల్లల మృతదేహాలు లభ్యం

Published Sat, Oct 1 2016 8:27 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

తల్లి సహా ఐదుగురు పిల్లల మృతదేహాలు లభ్యం - Sakshi

తల్లి సహా ఐదుగురు పిల్లల మృతదేహాలు లభ్యం

పిట్లం(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం సమీపంలోని పిల్లివాగులో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మెదక్ జిల్లా కంగ్టీ మండలానికి చెందిన రాజమణి అనే మహిళ తన ఐదుగురు పిల్లలతో సహా కారులో నిజామాబాద్ వెళ్తుండగా.. పిల్లి వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. కారు అందులో కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి బయటపడిన డ్రైవర్ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు.

డ్రైవర్ తో పాటు మృతురాలి తమ్ముడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు తాడు సాయంతో వారిని రక్షించారు. తల్లి సహా ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన ఐదుగురు చిన్నారులలో  ప్రియ (7), జ్యోతి (6), జ్ఞాన అశ్మిత (3), జ్ఞాన సమిత (3), గీతాంస (13) ఉన్నారు. మృతదేహాలను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement