ఎల్లారెడ్డిపేట(కరీంనగర్): కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ గ్రామ చెరువుకు గండిపడింది. గ్రామస్థులంతా నిద్రిస్తున్న సమయంలో శనివారం అర్ధరాత్రి చెరువుకు గండిపడటంతో.. దిగువకు దూసుకొచ్చిన నీరు కొద్దిసేపట్లోనే గ్రామాన్ని ముంచెత్తింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను రక్షించారు. వదర ఉధృతికి సుమారు 100 పశువులు కొట్టుకుపోయి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.
చెరువుకు గండి.. కొట్టుకుపోయిన పశువులు
Published Sun, Sep 25 2016 9:15 AM | Last Updated on Wed, Aug 1 2018 4:01 PM
Advertisement
Advertisement