కేంద్రానికి పట్టని ప్రజల ఇక్కట్లు
Published Mon, Nov 14 2016 9:35 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
అమలాపురం టౌన్ :
పెద్ద నోట్ల రద్దుతో ప్రజల ఇక్కట్లను ఏ మాత్రం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అమలాపురం ఎస్‌బీఐ మెయిన్‌బ్రాంచి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ధర్నాకు దిగారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోట్లు రద్దు చేసే ముందు ప్రజలు ఇబ్బంది పడుకుండా జాగ్రత్తలు తీసుకోలేదని రుద్రరాజు ధ్వజమెత్తారు. బ్యాంకుల వద్ద మహిళలు, వృద్ధులు క్యూల్లో గంటల తరబడి నిలబడి ఎన్ని పాట్లు పడుతున్నారో ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. పెద్ద నోటుకు చిల్లర పుట్టటం గగనమవుతోందన్నారు. పీసీసీ కార్యదర్శులు కల్వకొలను తాతాజీ, వంటెద్దు బాబి, కంచిపల్లి అబ్బులు, సత్తి బాపూజీ, పీసీసీ అధికార పత్రినిధి ముషిణి రామకృష్ణారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement