సెరిబ్రల్ లక్షణాలతో బాధపడుతున్న గిరిజన బాలుడు చిన్న
పార్వతీపురం : సెరిబ్రల్ మలేరియాతో బాధపడుతున్న రెండేళ్ల గిరిజన చిన్నారిని తల్లిదండ్రులు బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. కొమరాడ మండలం గొర్లిమ గ్రామానికి చెందిన మీనక పూలు, రుత్తు దంపతులకు చెందిన చిన్న దాదాపు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో వారు చిన్నాను ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి సెరిబ్రల్ మలేరియాగా గుర్తించి విశాఖ తీసుకెళ్లాలని సూచించారు.