విద్యార్థుల చెంతకే ధృవపత్రాలు | certificates near students | Sakshi
Sakshi News home page

విద్యార్థుల చెంతకే ధృవపత్రాలు

Published Sat, Mar 25 2017 12:04 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

certificates near students

- జాయింట్‌ కలెక్టర్‌ కీలక నిర్ణయం 
- కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన రెవెన్యూశాఖ
 
కర్నూలు(అగ్రికల్చర్‌): త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారభం కానున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన వివిధ రకాల ధృవపత్రాలు పొందేందుకు విద్యార్థులు పడుతున్న కష్టాలను తొలగించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన ధృవపత్రాలను వారి చెంతకే చేర్చాలని నిర్ణయించారు. ఈ వినూత్న విధానానికి కార్యాచరణ ప్రణాళికను రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. స్కాలర్‌షిఫ్‌లు, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ ఇతరత్రా సంక్షేమ ఫలాలు పొందడానికి విద్యార్థులకు పలు రకాల ధృవపత్రాలు అవసరమవుతాయి.
 
విద్యా సంవత్సరం వస్తుందంటే చాలు వీటికోసం విద్యార్థులు మీసేవ కేంద్రాలు, తహసీల్దారు కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాయింట్‌ కలెక్టర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుల ధృవీకరణ పత్రాలు ఒకసారి తీసుకుంటే శాశ్వతంగా ఉపయోగపడుతాయి. అలాగే తెల్లరేషన్‌కార్డులున్న వారు ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరంలేదు. నివాస ధృవీకరణ కోసం రేషన్‌ కార్డు/ఆధార్‌ కార్డును ఉపయోగించుకునేలా చర్యలు తీసుకున్నారు.
 
ఇది కార్యాచరణ ప్రణాళిక...
మొదటి దశలో ఈ నెల 24 నుంచి 30వరకు తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది విద్యా సంస్థలకు వెళ్లి ధృవీకరణ పత్రాల అవశ్యకతపై అవగాహన కల్పిస్తారు. ధృవపత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు దరాఖాస్తు చేసుకునేందుకు అవసరమైన ఫారాలు అందిస్తారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 10వరకు విద్యార్థులు తమకు అవసరమైన సర్టిపికెట్ల కోసం దరఖాస్తులు పూర్తి చేసి అవసరమైన ఫీజుతో సహా ప్రధానోపాధ్యాయులకు అందిస్తారు. 11 నుంచి 20 వ తేదీ వరకు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది వీటిపై విచారణ జరిపి ధృవీకరణపత్రాలను మంజూరు చేస్తారు. మీసేవ నిర్వాహకులు వాటిని ప్రింట్‌ తీసి సంబంధిత తహసీల్దార్లకు అందచేస్తారు. ధృవ పత్రాల మంజూరు సమాచారం విద్యార్థులకు మెసేజ్‌ ద్వారా తెలియజేస్తారు. అనంతరం రెవెనూ సిబ్బంది వాటిని నేరుగా విద్యాసంస్థలకు తీసుకెళ్లి విద్యార్థులకు అందిస్తారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement