వేల్పూరు లో చైన్ స్నాచింగ్
Published Fri, Aug 19 2016 7:13 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం అమీనాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Advertisement
Advertisement