కుస్తీ మే సవాల్‌ | challenge in wrestling | Sakshi
Sakshi News home page

కుస్తీ మే సవాల్‌

Published Sat, Aug 20 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

challenge in wrestling

రెజ్లింగ్‌లో రాణిస్తున్న ఓరుగల్లు పహిల్వాన్లు
జాతీయ స్థాయిలో పతకాలు కైవసం
అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటేందుకు కృషి
 
 వరంగల్‌ స్పోర్ట్స్‌: కండబలం.. ఉడుముపట్టు.. నైపుణ్యం కలగలిపిన ఆట రెజ్లింగ్‌. క్రీడాకారులు పోటీల్లో గెలిచేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తుం టారు. ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు తొడగొట్టి సవాల్‌ చేస్తుంటారు. అయితే కండలు తిరిగిన పహిల్వాన్ల క్రీడగా పేరొందిన రెజ్లింగ్‌లో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. వివిధ పతకాలు సాధిస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు.
   రెజ్లింగ్‌లో మనదేశానికి చెందిన క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. తాజాగా జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో మహిళల 58 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి ‘సాక్షి మాలిక్‌’ అద్భుత ప్రదర్శన ఇచ్చి కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే సాక్షిమా లిక్‌తోపాటు నర్సింగ్‌యాదవ్‌లాంటి అత్యుత్తమ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకున్న జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు, యువకులు రెజ్లింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతూ రాణిస్తున్నారు. 
ప్రాచీన విద్యగా కుస్తీ
పోరాట క్రీడల్లో కుస్తీ అతి ప్రాచీనమైన విద్య. పోరాటాల్లో బరిలో దిగి ఎదుటి వ్యక్తిని మట్టి కరిపించేందుకు కండలు తిరిగిన వీరులు హోరాహోరీగా తలపడడమే కుస్తీ ప్రాముఖ్యత. అయితే ఇందులో పాల్గొనే బలవంతులను పహిల్వాన్లు అం టారు. క్రీస్తు పూర్వం 13లేదా 12వ శతాబ్దంలో కుస్తీ ప్రాచీన భారతీయ విద్యగా ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. 15 వేల సంవత్సరాల క్రితం ఫ్రాన్స్, ఈజిప్టియన్‌లో ఈ విద్య కొనసాగిందని కొంద రు చెబుతున్నప్పటికీ అందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. కాగా, పదిహేను, ఐదో శతాబ్దాల నడుమ ఫ్రాన్స్, జపాన్, ఇంగ్లం డ్‌ దేశాల్లో రాజకుటుంబాలు కుస్తీని పెంచిపోషించినట్లు తెలుస్తుంది. కుస్తీ ద్వారా శత్రువులను మట్టికరిపించి రాజ్యాలను రక్షించుకోవడం, ఆక్రమించుకోవడం జరిగినట్లు చరిత్రలో పేర్కొన్నారు.
1904లో ఒలింపిక్స్‌లో స్థానం
మొట్టమొదటి జాతీయ కుస్తీ టోర్నమెంట్‌ 1888లో న్యూయార్క్‌లో జరిగింది. 1904 లో ఈ ఆటను ఒలంపిక్స్‌లో చేర్చారు. కాగా, 1912లో యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ స్థాపించారు. కుస్తీలో ఫ్రీసై్టల్, బీచ్, ఆయిల్‌ విభాగాలు ఉం టాయి. ప్రొఫెషనల్‌ కుస్తీల్లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలను నిర్వహిస్తారు.
రాణిస్తున్న రాజేశ్వరి
పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన బి. రాజేశ్వరి ఐదేళ్లుగా కరీంనగర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ కుస్తీలో కోచ్‌ అశోక్‌నాయక్‌ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న రాజేశ్వరి ఐదేళ్లలో మూడు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. గత ఏడాది వరంగల్, మహారాష్ట్రలో జరి గిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని రెండు కాంస్య పతకాలు సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్‌ను స్ఫూర్తిగా తీసుకుని కుస్తీలో మరింత పట్టు సాధించి అంతర్జాతీయస్థాయిలో రాణిస్తానని చెప్పింది.  
వికసిస్తున్న వినోద్‌
జిల్లాలోని కురవి మండలానికి చెందిన ఆర్‌. వినోద్‌ రెజ్లింగ్‌లో సత్తాచాటుతున్నారు. చిన్నప్పటి నుంచే కుస్తీపై ఆసక్తి పెంచుకున్న ఆయన అందులో ప్రత్యేక శిక్షణ పొందాడు. ఇందులో భాగంగా వినోద్‌ ఐదేళ్లుగా కుస్తీలో మెళకువలు సాధించాడు. గత ఏడాది మహారాష్ట్రలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరపున హాజరై కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అలాగే ఢిల్లీ, వరంగల్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీ ల్లో పాల్గొని సత్తాచాటాడు. అంతకుముందు హైదరాబాద్, కరీంనగర్‌లో జరిగిన రెండు స్టేట్‌ లెవల్‌ పోటీల్లో పాల్గొని ఒక కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రెజర్లు నర్సింగ్‌యాదవ్, సాక్షిమాలిక్‌ను ఆదర్శంగా తీసుకుని రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానన్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement