పార్టీని నమ్మిన వారికే అవకాశం | chance for party believers | Sakshi
Sakshi News home page

పార్టీని నమ్మిన వారికే అవకాశం

Apr 20 2017 12:21 AM | Updated on May 29 2018 4:37 PM

పార్టీని నమ్మిన వారికే నంద్యాల ఉప ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి చెప్పారు.

నంద్యాల: పార్టీని నమ్మిన వారికే నంద్యాల ఉప ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి చెప్పారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీ వెంటే ఉన్నారన్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్‌ఎండీ జహీర్‌బాషా, పార్టీ నేతలు మలికిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గంగాచరణ్‌రెడ్డి, గోస్పాడు వీరారెడ్డి, డాక్టర్‌ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement