gouru venkatreddy
-
ఓటమి భయంతోనే బెదిరింపులు
- నంద్యాలలో అలజడికి టీడీపీ యత్నం - ప్రలోభాలతో గెలవాలనుకోవడం అవివేకం - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ధ్వజం నంద్యాల అర్బన్ : ‘ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టింది. దీంతో ప్రలోభాలకు లొంగని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్రశాంతమైన నంద్యాలలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నార’ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి విమర్శించారు. అధికార పార్టీ బెదిరింపులకు తమ పార్టీ శ్రేణులు కూడా భయపడబోవని స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారన్న ఊహాగానాలకు తెరదించుతూ బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ పదవుల ఆశ చూపి నాయకులను తిప్పుకున్నంత మాత్రాన గెలుపు సాధిస్తామనుకోవడం అవివేకమన్నారు. ప్రలోభాలకు లొంగని కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంటిపై పోలీసులతో దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. తమ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమన్నారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు వైఎస్సార్సీపీ వైపు ఉన్నారని తెలిసే ప్రభుత్వం ఆ వర్గం నాయకులకు తాయిలాలు ఎర వేస్తోందన్నారు. నంద్యాల ఉప ఎన్నిక గెలుపు కోసం ప్రభుత్వం అడ్డదారులు తొక్కేందుకు సిద్ధపడుతోందన్నారు. మూడేళ్ల పాలనలో నంద్యాల అభివృద్ధిని మరిచిన సర్కారు.. ఉప ఎన్నిక నేపథ్యంలో రూ.కోట్లతో పనులు చేపట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పరిపాలన తప్ప మిగిలిన అన్నీ చేస్తోందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ వారిని ఎప్పుడు తీసుకోవాలనే దానిపైనే మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎంపీ ఎస్పీవైరెడ్డి ప్రమాణస్వీకారం చేయకముందే టీడీపీలోకి వెళ్లడాన్ని నంద్యాల ప్రజలు జీర్ణించుకోలేక పోయారన్నారు. నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, ఇందు కోసం ప్రలోభాలు, బెదిరింపులకు తెర తీసిందని విమర్శించారు. రాబోవు సాధారణ ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నిక నాంది కాబట్టే అధికార పార్టీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. సీఈసీ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే నంద్యాల ప్రజలకు ఎనలేని అభిమానమన్నారు. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి, నాయకులు విజయశేఖర్‌రెడ్డి, రవిచంద్రకిశోర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కైపరాముడు, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రిలో విద్యుత్ సమస్యపై గౌరు ఆగ్రహం
- మంత్రి కామినేని శ్రీనివాస్ తొలగింపునకు డిమాండ్ - సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వెల్లడి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నాలుగైదు రోజులుగా పెద్దాసుపత్రిలోని కొన్ని వార్డులకు నెలకొన్న విద్యుత్ సమస్యపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, బాలింతలుండే వార్డులకు కరెంట్ లేకపోవడంతో తీవ్ర అవస్థలుపడుతున్నారని శనివారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా చేసి మంత్రి కామినేని శ్రీనివాస్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పెద్దాసుపత్రిలో కరెంట్ లేక రోగులు పడుతున్న అవస్థలను నాలుగురోజుల క్రితం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు దృషికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కరెంట్ సక్రమంగా సరఫరా చేయకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళలు చేపడతామని ఆయన హెచ్చరించారు. -
మోసం చంద్రబాబు నైజం
- ఒక్క హామీని అమలు చేయని సీఎం - అభివృద్ధి పేరుతో దోపిడీ - శ్రీశైలం ఎమ్మెల్యే పార్టీ మారి ఓటర్లను వంచించాడు - వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆత్మకూరు: నమ్మిన వారిని మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నైజమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. ఆత్మకూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి అధ్యక్షతన ప్లీనరీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ నాయకులు బీవై రామయ్య, కాటసాని రామిరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పేరుతో, వివిధ ప్రాజెక్టుల నిర్మాణమంటూ అక్రమ సంపాదనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల్లో వి«శ్వాసం కోల్పోయారని తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బుడ్డా రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరి ఓటర్లను వంచించారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి తన తండ్రి స్వర్గీయ బుడ్డా వెంగళరెడ్డిలా ఇచ్చిన మాటకు కట్టుబడి, కార్యకర్తలు అండగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇందుకు బూత్ కమిటీ సభ్యులే కీలకమని సూచించారు. వైఎస్ఆర్సీపీతోనే సీమ సస్యశ్యామలం: గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్సీ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో చంద్రబాబు కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారు. సీమలో కరువు పారదోలేందుకు సిద్దేశ్వరంతోనే సాధ్యం. ఇక్కడ అలుగు, వంతెన నిర్మాణానికి మహానేత వైఎస్ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను విస్మరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి అధికారంతోనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. చంద్రబాబుకు శాపం ఉంది: బీవై రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఓ శాపం ఉంది. దీంతో ఆయన నిజం మాట్లాడరు. నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుంది. మూడేళ్ల పాలనలో ప్రజలకు ఆర్భాటంగా ప్రచారం చేయడం మినహా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చంద్రబాబు పాలన అంటే కరువు కాటకాలు తథ్యమని ప్రజలకు తెలిసిపోయింది. మహానేత పాలన తిరిగి రావాలంటే జననేత జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. సమయం లేదు మిత్రమా.... రణానికి సిద్ధంకండి: కాటసాని రామిరెడ్డి, బనగానపల్లె ఇన్చార్జ్ మిత్రమా ఎన్నికలకు సమయం లేదు. మనం రణానికి సిద్ధంగా ఉండాలి. 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయ్యారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సీఎం తన కుమారుడు లోకేష్‌కు రాజకీయ ఉపాధి కల్పించారే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపాధి పనులు కల్పించలేదు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తరిమికొడదాం. జగన్ వెంటే ప్రజలు: ఐజయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ప్రజలు ఉన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అరచాకాలు, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారు. నవ నిర్మాణదీక్ష పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారు. అన్ని సీట్లు మావే: రాజగోపాల్‌రెడ్డి, నంద్యాల వైఎస్సార్సీపీ ఇన్చార్జి వచ్చే ఎన్నికల్లో జిల్లాల్లోని 14 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం తథ్యం. ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అభివృద్ధి నిధులు పంచుకుంటున్నారు. -
పార్టీని నమ్మిన వారికే అవకాశం
నంద్యాల: పార్టీని నమ్మిన వారికే నంద్యాల ఉప ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి చెప్పారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ ఇన్చార్జి రాజగోపాల్రెడ్డని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల ప్రజలు వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారన్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ఎండీ జహీర్‌బాషా, పార్టీ నేతలు మలికిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గంగాచరణ్‌రెడ్డి, గోస్పాడు వీరారెడ్డి, డాక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.