పెద్దాసుపత్రిలో విద్యుత్ సమస్యపై గౌరు ఆగ్రహం
Published Sat, Jun 24 2017 10:00 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
- మంత్రి కామినేని శ్రీనివాస్ తొలగింపునకు డిమాండ్
- సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వెల్లడి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నాలుగైదు రోజులుగా పెద్దాసుపత్రిలోని కొన్ని వార్డులకు నెలకొన్న విద్యుత్ సమస్యపై వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, బాలింతలుండే వార్డులకు కరెంట్ లేకపోవడంతో తీవ్ర అవస్థలుపడుతున్నారని శనివారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా చేసి మంత్రి కామినేని శ్రీనివాస్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పెద్దాసుపత్రిలో కరెంట్ లేక రోగులు పడుతున్న అవస్థలను నాలుగురోజుల క్రితం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు దృషికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కరెంట్ సక్రమంగా సరఫరా చేయకపోతే వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
Advertisement
Advertisement