రైఫిల్ షూటింగ్‌లో సత్తాచాటిన చరదీప్
కడప ఎడ్యుకేషన్:
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో కడపకు చెందిన బండ్లపల్లె చరదీప్‌రెడ్డి సత్తా చాటాడు. కడప నారాయణ ఒలంపియాడ్ జూని యర్ కళాశాల ప్రధమ సంవత్సర ఇంటర్ చదువుతున్న ∙బండ్లపల్లె చరదీప్‌రెడ్డి సబ్ జూనియర్ రైఫిల్ షూటింగ్‌లో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బండ్లపల్లె చరదీప్‌రెడ్డి కడప డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి కుమారుడు. గుంటూరులో 17వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ లెవల్ రైఫిల్ çషూటింగ్ 2016 పోటీలను మూడు రోజుల పాటు నిర్వహించారు. ఇందులో చరదీప్‌రెడ్డి ప్రతిభ చాటడంతో తల్లిదండ్రులు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి, కల్పలతారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. నారాయణ ఒలంపియాడ్ డీజీఎం రామ్మోహన్‌రెడ్డి, డీన్ చంద్రకిషోర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ మురళీమోహన్‌లు చరదీప్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.