గొర్రెల మందపై చిరుత దాడి | cheatah attacks sheeps | Sakshi
Sakshi News home page

గొర్రెల మందపై చిరుత దాడి

Published Sat, Feb 18 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

cheatah attacks sheeps

మడకశిర రూరల్‌ : కదిరేపల్లి సమీపంలో హంద్రీనీవా కాలువ వద్ద శుక్రవారం తెల్లవారుజామున కాపరి రంగనాథ్‌కు చెందిన గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. మందలోకి చిరుత ప్రవేశించిన వెంటనే కేకలు వేయడంతో మేకను చంపివేసి అక్కడే వదిలి గొర్రెను కొండప్రాంతంలోకి ఎత్తుకెళ్లి వదలేసిందని బాధితుడు తెలిపాడు. దీంతో దాదాపు రూ.13 వేల నష్టం వాటిల్లిందన్నాడు. రెండు నెలల వ్యవధిలో నరసప్ప, తిప్పేరంగప్ప, రంగధామప్ప తదితరులకు చెందిన దాదాపు పది మేకలు, గొర్రెలను చిరుత చంపివేసిందని గ్రామస్తులు తెలిపారు. అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకుని చిరుత దాడిలో మృతి చెందిన మేకలు, గొర్రెల కాపరులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement