చిలమత్తూరు : కర్ణాటకలోని బాగేపల్లి ప్రాంతం కొత్తకోట సర్పంచ్ వెంకటరెడ్డిపై శనివారం చీటింగ్ కేసు నమోదు చేసిన ట్లు అనంతపురం జిల్లా చిలమత్తూరు ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపారు. మండలంలోని సోమఘట్ట పంచాయతీ చెరువు ముందరపల్లి బ్రహ్మానందస్వామి మఠం భూముల వ్యవహారంలో రూ.లక్షల కొద్దీ ఆశ్రమ నిర్వాహకుడు రఘుస్వామికి మోసం చేసినట్లు వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.