
సాక్షి, బెంగళూరు: బెంగళరులో మరో సహకార సంస్థ బోర్డు తిప్పేసింది. గవిపురలోని శ్రీ వశిష్ట సౌహార్ధ సహకార సంఘం చేతిలో రూ.430 కోట్లు క్కుకున్నాయి. ఖాతాదారులు, డిపాజిటర్లు సోమవారం హనుమంతనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే బ్యాంకు ప్రముఖులు వెంకటనారాయణ, కృష్ణప్రసాద్ పరారయ్యారు. నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్న ఈ సహకార సంస్థలో వేలాదిమంది పెట్టుబడులు పెట్టారు. అధిక వడ్డీల ఆశ చూపి సుమారు రూ.430 కోట్ల పెట్టుబడులను సేకరించింది. డిపాజిటర్ల మదుపు మెచ్యర్ అయినా వెనక్కి ఇవ్వడం లేదు.
కరోనాపేరుతో వాయిదా వేస్త వచ్చారు. బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య వినతుల మేరకు మదుపుదారులు ఆరునెలలు ఓపిక పట్టినా ప్రÄñæజనం లేదు. సొసైటీపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని దక్షిణ విబాగ డీసీపీ హరీశ్‌పాండే తెలిపారు. పైసాపైసా కూడబెట్టిన సొమ్ము చెల్లిస్తే నట్టేట ముంచుతారా? అని ఖాతాదారులు వాపోయారు. నగరంలో గతంలో పలు సహకార సంస్థలు, బ్యాంకులు ఇదేరీతిలో బోర్డు తిప్పేయడంతో వేలాదిమంది సొమ్ము కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment