బ్యాంకు అధికారిని అని చెప్పి టోకరా
Published Sat, Dec 17 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
– బ్యాంకు ఏటీఎం, పిన్ నంబర్లు చెప్పించుకొని రూ. 44, 998 విత్‌డ్రా
– కర్నూలు టూటౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు మద్దిలేటి
.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న టి.మద్దిలేటికి గుర్తుతెలియని వ్యక్తి. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని ఏటీఎం, పిన్ నంబర్లు చెప్పించుకొని 44,998 రూపాయలను విత్‌డ్రా చేశారు. మోసపోయానన్న విషయాన్ని తెలుసుకున్న అతను.. టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు...మునిసిపల్ కార్మికుడిగా పనిచేస్తున్న మద్దిలేటికి ఎస్‌బీహెచ్ కేఎంసీలో బ్యాంకు ఖాతా ఉంది. ఇటీవల లావాదేవీలు జరపగా మిగిలిన 86,160 రూపాయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఈ విషయాన్ని పసిగట్టి.. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని(సెల్ నంబర్ 9083252363) చెప్పారు. మీ ఏటీఎం బ్లాక్ అయిందని, ఆధార్‌కార్డు నంబర్, ఏటీఎం నంబర్, పిన్ నంబర్లను చెప్పమనడంతో అవగాహన లేని మద్దిలేటి తొందరపడి చెప్పేశాడు. ఇక క్షణాల్లో మొదటిసారి 20,000, రెండోసారి 9999 వేలు, మూడో సారి 9999, నాలుగోసారి 5000 వేలు మొత్తం 44998 రూపాయలు తన అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని డ్రాచేసేకున్నాడు. మద్దిలేటికి సెల్ మెస్సేజ్ చూసే అవగాహన లేదు. దీంతో ఇంటికి వెళ్లిన తరువాత కూతురుకు చూపించాడు. ఆమె డబ్బులు డ్రా అయినట్లు చెప్పడంతో లబోదిబోమంటూ బ్యాంకు మేనేజర్‌ను కలిశారు. అయన డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు చెప్పాడు. దీంతో మద్దిలేటి టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కూతూరు పెళ్లి కోసం ఉంచుకున్న డబ్బులను దుండగులు డ్రా చేసుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని, పోలీసు అధికారులే తనకు న్యాయం చేయాలని మద్దిలేటి కోరారు.
Advertisement
Advertisement