విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద ఓ అనాథాశ్రమం చిన్నారులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద ఓ అనాథాశ్రమం చిన్నారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డులోని చెత్తకు మున్సిపల్ సిబ్బంది నిప్పు పెడుతుండడంతో సమీపంలోనే ఉన్న జట్టు అనాథాశ్రమం చిన్నారులు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో చెత్త వేయవద్దని కోరుతూ గత రెండు రోజులుగా చిన్నారులు రహదారిపై రాస్తారోకో చేశారు. అయినా శుక్రవారం ఉదయం యథావిధిగా చెత్త వేయడానికి మున్సిపల్ సిబ్బంది రావడంతో మరోసారి చిన్నారులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు, ఆశ్రమం నిర్వాహకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.