ఇల్లు బోర్ కొట్టిందో ఏమో..
అనంతపురం: ఇల్లు బోర్ కొట్టిందో లేక కొత్తగా ఏదైనా చేయాలి అనే కుతూహలమో తెలియదు గాని అనంతపురంలో ఇద్దరు చిన్నారులు పెద్ద పనే చేశారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ఉంచిన 2 లక్షల రూపాయలతో బయటపడ్డారు. చిన్నాళ్లు కదా ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనే విషయంలో స్పష్టత లేదు. రైల్లో వెళ్తే బాగుంటుందని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.
రైల్వే స్టేషన్‌లో చిన్నారుల బిత్తరచూపులు అర్థం కావడంతో ఆటో డ్రైవర్లు నిలదీశారు. అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లలను వారికి అప్పగించారు. పోలీసులు పిల్లలతో పాటు నగదును తల్లిదండ్రులకు అప్పగించారు. ఎంత చిన్నారులైనా వారి ఆలోచనలేంటి అనే విషయంపై తల్లిదండ్రులు కాస్త నజర్ ఉంచడం మంచిదంటున్నారు పోలీసులు.