గొంతు కోసి.. గొలుసు లాక్కెళ్లారు..
వరంగల్: ఇన్నాళ్లూ బంగారు గొలుసులు మాత్రమే లాక్కొని వెళ్లిన చైన్ స్నాచర్లు రూటు మార్చారా? మహిళలపై మరింత కర్కశ దాడులకు సిద్ధమవుతున్నారా? బుధవారం వరంగల్ లో జరిగిన ఘాతుకం ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తింది.
సాధారంణంగా బైక్ లపై వచ్చి మెడలో గొలుసుల్ని తెలంపుకెళుతున్న దుండగులు.. ఎంచుకున్న ప్రాంతాల్లో ఒంటరి మహిళలను గుర్తించి వారిపై రెక్కీ నిర్వహించిమరీ దాడులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. ఒంటరిగా ఉన్న యువతిపై దాడిచేసి, కత్తితో గొంతుకోసి, మెడలోని బంగారు గొలుసును తెంపుకొని వెళ్లారు. సహాయం అందేలోపే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే చైన్ స్నాచర్లపై దోపిడీ కేసులు పెడతామని, స్నాచింగ్ లను అరికట్టేలా బీట్ కానిస్టేబుల్ నుంచి కంట్రోల్ రూమ్ వరకు పటిష్ఠ వ్యవస్థను రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్నాచర్లు హత్యలకు పాల్పడితే ఎలా అడ్డుకట్టవేయాలన్నదానిపైనా ప్రభుత్వం కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.