చింటూకు ఈ నెల 27 వరకు రిమాండ్ పొడిగింపు
చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్తో పాటు నిందితులందరికీ రిమాండు గడువును ఈనెల 27 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
కేసు విచారణలో భాగంగా బుధవారం చింటూను కడప జైలు నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చిత్తూరులోని నాలుగో అదనపు కోర్టుకు తరలించారు. తదుపరి విచారణను ఈ నెల 27కు న్యాయమూర్తి వాయిదా వేశారు. కాగా ఈ కేసులో రిమాండు ఖైదీలుగా చిత్తూరు జిల్లా జైలులో ఉన్న 20 మంది నిందితులను న్యాయమూర్తి వీడియో కాన్ఫరెస్సు ద్వారా విచారించి, వీళ్లకు సైతం రిమాండు గడువును 27 వరకు పొడిగించారు. కాగా మహిళలను మోసం చేసిన పావని కేసులో పోలీసులు చింటూను ప్రధాన నిందితుడిగా చేర్చుతూ.. పీటీ వారెంట్‌ను కోర్టుకు సమర్పించారు. అనంతరం రిమాండు రిపోర్టును పోలీసులు చింటూకు అందచేశారు.