సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశాంతం
విజయవాడ/ఆటోనగర్ :
యూపీఎస్‌సీ నగరంలో ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతగా ముగిశాయి. నగరంలోని పరీక్షా కేంద్రాల్లో 4, 647 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంది. ఉదయం జరిగిన పేపర్–1కు 4,372 మంది, మధాహ్నం పేపర్–2కు 4,293 మంది (29.31 శాతం) హాజరయ్యారు. బిషప్ హజరయ్య స్కూల్‌లోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ బాబు.ఎ పరిశీలించారు. ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రత చర్యలు చేపట్టారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.