-
నగదు కొరతతో కుదేలైన వస్త్రవ్యాపారం
-
90 శాతం తగ్గిన క్రిస్మస్ అమ్మకాలు
-
న్యూ ఇయర్, సంక్రాంతికి ఎలా ఉంటుందోనని వ్యాపారుల గుబులు
-
నిర్వహణ ఖర్చులు కూడా రాని వైనం
-
ఖాళీగా కనిపిస్తున్న దుకాణాలు
-
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదంటున్న వ్యాపారవర్గాలు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా తయారైంది పెద్ద నోట్ల రద్దు వ్యవహారం. నల్లధనం అరికట్టడం, నకిలి కరెన్సీకి అడ్డుకట్ట వేయడం కోసమంటూ గత నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత జిల్లాలో వస్త్ర వ్యాపారం పూర్తిగా పడిపోయింది. కొనుగోలుదారులు తగినంతగా రాక రెండు నెలలుగా దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఆదాయం మాట దేవుడెరుగు.. కనీసం సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులైనా రాకపోవడంతో వస్త్ర వ్యాపారులు విలవిలలాడుతున్నారు. ప్రస్తుతం క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలు వరుసగా వస్తున్నాయి. మామూలుగా అయితే ఈ పండగ సీజ¯ŒSలో మంచి వ్యాపారం జరిగేది. కానీ, పండగ వ్యాపారంపై వ్యాపారులు వేసుకున్న అంచనాలు నగదు కొరతతో తలకిందులవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని వస్త్ర వ్యాపారులు వాపోతున్నారు.
కరెన్సీ సంక్షోభంతో తలకిందులు
సాధారణంగా ఏడాదంతా జరిగే వ్యాపారం ఒక ఎత్తయితే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండగల సీజ¯ŒS నెల రోజులపాటు జరిగే వ్యాపారం మరో ఎత్తు. ఏడాదిలో 11 నెలల వ్యాపారానికి, ఈ పండగ సీజ¯ŒSలో జరిగే వ్యాపారానికి పూర్తిగా తేడా ఉంటుంది. ఈ ఒక్క నెలలో చేసిన వ్యాపారం 11 నెలలకు సమానం. అలాంటిది ఈ ఏడాది పెద్ద నోట్ల రద్దు, ఆపై నెలకొన్న నగదు కొరత తదితర పరిణామాలు వస్త్ర వ్యాపారాన్ని తలకిందులు చేశాయి. సాధారణ రోజుల్లో జరిగినట్లు కూడా ప్రస్తుతం అమ్మకాలు జరగడంలేదని వస్త్రవ్యాపారులు వాపోతున్నారు.
రాత్రి 9 గంటలకే బంద్
సాధారణంగా పండగ సీజ¯ŒSలో దుకాణాలు రాత్రి 11 గంటల వరకూ కొనుగోలుదార్లతో సందడిగా ఉంటాయి. దుకాణం మూసివేసిన తర్వాత సర్దుకోవడానికి మరో గంటన్నర పడుతుంది. అయితే ఈ ఏడాది పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రజల వద్ద నగదు లేకపోవడంతో రాత్రి తొమ్మిది గంటలకే దుకాణాలు మూసివేస్తున్న పరిస్థితి నెలకొంది.
మాల్స్‌కూ గట్టి దెబ్బ
పెద్ద నోట్ల రద్దు దెబ్బ షాపింగ్ మాల్స్‌కూ గట్టిగానే తగిలింది. పండగ సీజ¯ŒSలో ఇప్పటికే కిటకిటలాడే మాల్స్‌లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. కొనుగోలుదారులకు వస్రా్తలు చూపిస్తూ, వాటిని మడతలు వేసుకునే పనిలో తీరిక లేకుండా గడపాల్సిన సిబ్బంది కూడా ఖాళీగా కూర్చుంటున్న పరిస్థితులున్నాయి. దీంతో కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ఎప్పటిలాగానే షాపింగ్ మాల్స్ ఈ ఏడాది కూడా డిస్కౌంట్లు, వ¯ŒS ప్లస్ వ¯ŒS, టూ ప్లస్ త్రీ వంటి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
సరుకు వస్తున్నా..
రిటైల్ దుకాణాలకు అవసరమైన దుస్తులను సూరత్, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కంపెనీలు ఉన్నంత వరకూ నగదు, మిగతాది అప్పుగా ఇస్తున్నాయి. వ్యాపారం జరిగేకొద్దీ డబ్బులు ఇవ్వండంటూ సరుకు పంపిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం అనుకున్నదానిలో 10 శాతం కూడా వ్యాపారం లేక దుకాణదారులు నిరాశకు గురవుతున్నారు.
స్వైపింగ్ యంత్రాలకు కొరత
ఖాతాల్లో నగదు ఉన్నా తీసుకునే అవకాశం లేకపోవడంతో చాలామంది రెండు జతలు కొనే దగ్గర ఒక జతతో ఆగిపోతున్నారు. ఎక్కువమంది పెద్దలు ఈసారి దుస్తుల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. తమవద్ద ఉన్న నగదుతో పిల్లలకు మాత్రమే తీసుకుంటున్నారు. దుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలుంటే పరిస్థితి కొంతవరకైనా మెరుగ్గా ఉండేది. కానీ, చాలాచోట్ల ఈ యంత్రాలకు కొరత ఉంది. స్వైపింగ్ మెషీన్లు కావాలని బ్యాంకులకు దరఖాస్తు చేసినా ఇప్పటివరకూ రాలేదని వ్యాపారులు వాపోతున్నారు. అటు ఒక్కసారిగా పెరిగిన డిమాండుకు తగినట్టుగా బ్యాంకులు కూడా ఈ యంత్రాలను అందించలేకపోతున్నాయి.
పండగ కళ తప్పింది
ఉభయ గోదావరి జిల్లాల వస్త్ర వ్యాపారానికి రాజమహేంద్రవరం, ద్వారపూడి కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడ రిటైల్, హోల్‌సేల్ అమ్మకాలు జరుగుతూంటాయి. రాజమహేంద్రవరంలోని మహాత్మాగాంధీ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్, ద్వారపూడి మార్కెట్లలో పండగ సీజ¯ŒSలో రోజుకు రూ.55 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా. ద్వారపూడి మార్కెట్‌లో 600 వస్త్ర దుకాణాలున్నాయి. మామూలు రోజుల్లోనే ఇక్కడ రోజుకు రూ.10 కోట్ల మేర వ్యాపారం జరుగుతూంటుంది. ఇక క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండగల సీజ¯ŒSలో రోజుకు దాదాపు రూ.50 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుంది. రాజమహేంద్రవరం, ద్వారపూడి మార్కెట్లను మినహాయిస్తే మిగిలిన జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో దాదాపు 10 వేల వస్త్ర దుకాణాలున్నాయి. వీటిద్వారా పండగ సీజ¯ŒSలో సాధారణంగా రోజుకు రూ.6 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్ ఫెడరేష¯ŒS వైస్ ప్రెసిడెంట్ పోకల సీతయ్య చెప్పారు. ఈ దుకాణాలకు షాపింగ్ మాల్స్ అదనం. పెద్ద నోట్ల రద్దుతో ఈ ఏడాది వీటన్నింటిలోనూ వ్యాపారం పూర్తిగా పడిపోయింది.
అందరికీ బట్టలు తీసుకోలేకపోతున్నాం
ఏటా రాజమహేంద్రవరం మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్‌కు వస్తాం. ఖాతాల్లో నగదు ఉన్నా తీసుకునే పరిస్థితి లేదు. ఏటీఎంల వద్ద నిల్చుంటే రెండు వేలు దొరుకుతున్నాయి. పండగకు అందరికీ బట్టలు తీసుకోలేకపోతున్నాం. పిల్లలకు మాత్రమే తీసుకున్నాం. అదీ పండగ స్థాయిలో తీసుకోలేదు. కిరాణా సరుకులు కూడా అనుకున్నంతగా కొనలేదు.
– కళావతి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా
10 శాతం కూడా లేదు
నగదు కొరతతో కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. గత ఏడాది క్రిస్మస్ సీజ¯ŒS వ్యాపారంతో పోల్చుకుంటే ఈ ఏడాది 10 శాతం కూడా లేదు. రాత్రి తొమ్మిది గంటలకే దుకాణం మూసేస్తున్నామంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు. స్వైపింగ్ మిషన్లున్నా పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది.
– దాసరి రామచంద్రరావు, శ్రీకనకదుర్గా టెక్స్‌టైల్, మహాత్మాగాంధీ మార్కెట్, రాజమహేంద్రవరం
కోట్లలో నష్టం
పండగ సీజనే వస్త్ర వ్యాపారులకు ముఖ్యమైనది. ఏడాదంతా వ్యాపారం లేకపోయినా ఈ ఒక్క నెల రోజుల్లో జరిగే వ్యాపారంతో వారు గట్టెక్కుతారు. అలాంటిది పెద్ద నోట్ల రద్దుతో దుకాణాలు మూసేసుకోవాల్సిన పరిస్థితి. ముందస్తు చర్యలు తీసుకోకుండా పెద్ద నోట్లను రద్దు చేయడం అనాలోచిత చర్య. మరో మూడు నాలుగు నెలలు ఇదే పరిస్థితి ఉండొచ్చు.
– పోకల సీతయ్య, వైస్ ప్రెసిడెంట్, ఏపీ టెక్స్‌టైల్ ఫెడరేష¯ŒS, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు
పండుగ బేరాలు పేలవంగా ఉన్నాయి
వస్త్ర దుకాణాల యజమానులు సీజనల్ అమ్మకాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. నోట్లు రద్దయిన గత 45 రోజులుగా వస్త్ర దుకాణాలు బేరాలు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పుడు ముందు కిస్మస్, తర్వాత సంక్రాంతి పండగలు వస్తున్నాయి. బేరాలు ఊపందుకుంటాయనుకున్నాం. పండగ సీజ¯ŒSలోనూ బేరాలు పేలవంగా ఉన్నాయి. దుకాణంలో పని చేసే సిబ్బంది ఖాళీగా ఉండాల్సి వస్తోంది.
– నార్కెడిమిల్లి ప్రసాద్, వెంకటేశ్వర సిల్క్ ప్యాలెస్, అమలాపురం
బోనస్ ఇస్తారో లేదో?
వ్యాపారం అస్సలు లేదు. ఈ సమయంలో మేము క్షణం కూడా తీరిక లేకుండా ఉంటాం. అలాంటిది ఖాళీగా కూర్చున్నాం. ప్రతి ఏడాది సంక్రాంతికి మాకు బోనస్‌లు ఇస్తారు. ఈసారి వ్యాపారం అస్సలు లేదు. బోనస్‌లు ఇస్తారో లేదో తెలియడంలేదు. పెద్ద నోట్ల రద్దు మా బోనస్‌లకు ఎసరు తెచ్చింది.
– ముప్పిడి రాజేష్, గుమస్తా, ప్రగతి ఫ్యాష¯Œ్స, రాజమహేంద్రవరం
రిపోర్టింగ్ : పలుకూరి కోటేశ్వరరెడ్డి, సాక్షి, రాజమహేంద్రవరం