బాబు ప్రసంగం..ఎక్కడెక్కడో విహారం
బాబు ప్రసంగం..ఎక్కడెక్కడో విహారం
Published Sat, Oct 22 2016 11:46 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
కాకినాడ నుంచి పాకిస్థా¯ŒS వరకు...
కేంద్రం ఇచ్చిన పథకాలకూ తన ముద్ర
ప్రజాపోరాటాలు చేసేవారంతా టెర్రరిస్టులేనట
జనం తరలింపుకోసం పాఠశాలలకు సెలవులు,
సినిమా హాళ్లకు ఉదయం ఆట కట్...
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
దోమలపై దండయాత్రకు శనివారం కాకినాడ వచ్చిన సీఎం చంద్రబాబు ప్రతి అంశంలోనూ తన గొప్పతనం చెప్పుకునే ప్రయత్నమే కనిపించింది. సుమారు 55 నిమిషాలపాటు సాగిన ఉపన్యాస ప్రవాహం ఆద్యంతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. సీఎం ప్రసంగం ప్రారంభమైన అరగంటకే మహిళలు, విద్యార్థులు తిరిగి వెళ్లిపోవడమే ఇందుకు సాక్ష్యం. జిల్లాలో ఏదైనా జరిగిందంటే అదంతా తన వల్లేనని చెప్పుకోవడం... సందర్భం లేకుండానే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జిల్లాను వణికించిన 1996 హరికే¯ŒS తుపాను జిల్లా ప్రజలకు మరోసారి ఎందుకు గుర్తు చేశారో అర్థం కాక జనం తలలుపట్టుకున్నారు. తుపానుకే పరిమితం కాకుండా పాకిస్థా¯ŒS టెర్రరిస్టుల ఆగడాలు... అంతర్జాతీయ పరిణామాలను వల్లెవేయడం మరింత విసుగుతెప్పించింది. ఉదయం 11.17 గంటలకు కాకినాడ పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో చాపర్‌లో దిగిన సీఎం తిరిగి 3.07 గంటలకు అదే పరేడ్ గ్రౌండ్స్ నుంచి విజయవాడ తిరుగు పయనమయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు కాకినాడలో గడిపిన సీఎం తొలుత కాకినాడ టూటౌ¯ŒS వద్ద దోమలపై దండయాత్రలో భాగంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ర్యాలీని ప్రారంభించి ఆధునిక ఫుడ్‌కోర్టుల వాహనాలను పరిశీలించి పలు కళాశాలు, పాఠశాలల నుంచి భారీగా సమీకరించిన విద్యార్థులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆనంద భారతి గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సుమారు 55 నిమిషాలపాటు సాగిన బాబు ప్రసంగమంతా ఆత్మస్తుతి, పరనిందతోనే సాగింది. చెప్పిందే చెబుతూ పాత విషయాలనే పదేపదే చెప్పడంతో జనం విస్తుపోయారు. జిల్లాకు రూ.35వేల కోట్ల పెట్రోకెమికల్ కాంప్లెక్స్, కాకినాడ నంచి బకింగ్‌హామ్ కెనాల్‌ను చెన్నై వరకు మంజూరు చేసినట్టు చెప్పుకున్నారు. కానీ ఈ రెండు ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఎప్పుడో ప్రకటించినవే. వాటిని కూడా బాబు తన ఖాతాలో వేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. పాతవాటికే రంగులేయడం ... కొత్తగా ప్రకటించిందేమీ లేకపోవడంతో ఒక దశలో చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వేదిక దిగువన ముందు వరుసలో మినహా వెనుక కుర్చీల్లో ఉన్న డ్వాక్రా మహిళలు, విద్యార్థులు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో నిర్వాహకుల్లో నిరాశే మిగిలింది.
అన్నీ నా ఘనతలే...
రైతులకు రూ.24వేల కోట్లు రుణ విముక్తి కల్పించింది దేశంలో తమ ప్రభుత్వమేనని, హైదరాబాద్‌లో మతకల్లోలు లేకుండా ఉన్నాయంటే అప్పటి తన పాలనా దక్షతేనంటూ బాబు గొప్పలకు పోయారు. రాష్ట్రమనే కుటుంబంలో తాను పెద్ద కొడుకునని మరోసారి చెప్పుకున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే తనలాంటి అనుభవం ఉన్న వారి వల్లనే అవుతుందని భావించి జనం ఓటేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఎక్కువే చేశానని చెప్పడంతో ఆశ్చర్యపోవడం జనం వంతయింది. డ్వాక్రా రుణ మాఫీ, నిరుద్యోగ భృతి వంటి వాటిని అమలు చేయని బాబు వాటిని కూడా అమలు చేశానని ప్రకటించుకోవడంతో ప్రజలు ముక్కునవేలేసుకున్నారు.
పోరాటాలు చేసేవారంతా టెర్రరిస్టులేనట!
ఆ బాబుకు ఈ బాబు రెండాకులెక్కవే...
ప్రజా వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ఆక్వాఫుడ్ పార్క్, రాజధాని నిర్మాణం, పట్టిసీమ, పురుషోత్తపురం తదితర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని టెర్రరిస్టులతో పోల్చడం విస్మయానికి గురిచేసింది. చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ’బాబు’కు తీసిపోలేదు. రోజూ ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు దోమలపై దండయాత్ర కోసమంటూ అధికారులతో కలిసి వార్డుల్లో తిరుగుతున్నట్టు కొండబాబు సీఎంకు చెబుతుంటే వేదికపై ఉన్న మున్సిపల్ అధికారులు బిక్కచచ్చిపోయాఆరు.సీఎంను పొగడ్తలతో ముంచెత్తిన కొండబాబు కాకినాడకు మూడో వంతెన మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటింపచేసుకోగలిగారు. ఎప్పుడో మంజూరైన బైపాస్‌కు మరోసారి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.
పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇచ్చి మరీ విద్యార్థులను సభకు, దోమలపై దండయాత్ర ర్యాలీకి పెద్ద ఎత్తున బస్సుల్లో తరలించారు. చివరకు సినిమా హాళ్లలో ఉదయం షోను కూడా రద్దు చేసేశారు. కాకినాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో జనం అడుగుడగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూ.3 వేలు పెట్టుబడి నిధికి సంతకాల కోసం రావాలని నగరం నలుమూలల నుంచి డ్వాక్రా మహిళలను ఆటోల్లో పెద్ద ఎత్తున తరలించారు.
Advertisement
Advertisement