నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రెండు రోజుల్లో రానున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద హెలీపాడ్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. చాలా ఏళ్ల తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతుండటంతో మంజీర నది జలకళను తిలకించడానికి సీఎం వస్తున్నారన్నారు.
ఢిల్లీ పర్యటన ముగించుకొని, రాష్ట్రానికి వచ్చిన సీఎం నిజాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరదనీటిని తెలుసుకున్నారన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని సీఎంకు ఫోన్ ద్వారా చెప్పగా, ప్రాజెక్టుకు వస్తానని చెప్పినట్లు మంత్రి పోచారం పేర్కొన్నారు. ప్రాజెక్టు సందర్శన కోసం ముఖ్యమంత్రి వస్తుండటంతో హెలీపాడ్ స్థలాన్ని ఎంపిక చేయాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, పోలీస్‌శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.
త్వరలో సీఎం నిజాంసాగర్ సందర్శన
Published Sat, Sep 24 2016 8:04 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
Advertisement