నీటి వాటా రాబట్టడంలో సీఎం విఫలం
నీటి వాటా రాబట్టడంలో సీఎం విఫలం
Published Sat, Apr 29 2017 10:24 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
– నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయం
– వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కల్లూరు (రూరల్): తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను రాబట్టడంలో సీఎం చంద్రబాబునాయుడు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం టీజే కాంప్లెక్స్‌లో పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఎంపీ బుట్టారేణుక ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడితోపాటు పార్టీ ఏపీ, టీఎస్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు బీ.వై.రామయ్య, మతీన్ ముజాద్దీన్, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర సెల్ ఎస్సీ సెల్ కార్యదర్శి మద్దయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల ఎమ్మెల్యే సీటు ఎవరికిచ్చినా వారిని సాదరంగా ఆహ్వానించి గెలిపించుకుంటామని చెప్పారు. సీఎం చంద్రబాబు అసమర్థ పాలనలో కర్నూలు, పాణ్యం ప్రజలు కన్నీటి కష్టాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే మంచినీళ్లు సరఫరా చేయించడం లేదని ఆరోపించారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేయండి
హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ పార్టీని బూత్ లెవల్ నుంచి పటిష్టం చేసేందుకు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగర ప్రజలు తాగునీటి సమస్యతో తల్లడిల్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట దోమల బెడద తీవ్రంగా ఉందని, దోమలపై దండయాత్ర కార్యక్రమం శుద్ధ దండగన్నారు. రాయలసీమ జిల్లాలో తమ పార్టీ ఎంత బలంగా ఉందో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిని భారీ విజయంతో తేటతెల్లమైందన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయకుమారి, సలోమి, మాజీ కార్పొరేటర్ దాదామియ్యా, బీకె రాజశేఖర్, పేలాల రాఘవేంద్ర, మాలిక్, జాన్, షోయబ్, హరికృష్ణ, కరుణాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అశోక్, మహిళా నేతలు షఫియాఖాతున్, వాహిదా, విజయలక్ష్మీ, మంగమ్మ, చెన్నమ్మ, వెంకటేశ్వరమ్మ, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు సోమసుందరం, గంగిరెద్దుల రాష్ట్ర అధ్యక్షుడు సీతయ్య పాల్గొన్నారు.
Advertisement