తిరుపతి చేరుకున్న సీఎం
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. ఆయన వెంట కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో సీఎంకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు సుగుణమ్మ, తలారి ఆదిత్య, జెడ్పీ చైర్మపర్సన్ గీర్వాణి, జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి స్వాగతం పలికిన వారిలో వున్నారు.
చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి వచ్చారు. రాత్రి పద్మావతీ అతిథి గృహంలో బస చేస్తారు. మంగళ, బుధవారాల్లో తిరుపతిలోనే వుంటారు. మంగళవారం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానితో పాటు హాజరవుతారు. బుధవారం చిల్డ్రన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సదస్సులను సీఎం ప్రారంభిస్తారు.