రూ. 10 లక్షలతో ఉడాయించిన ఉద్యోగి | CMS employee escapes with Rs 10 lakhs | Sakshi
Sakshi News home page

రూ. 10 లక్షలతో ఉడాయించిన ఉద్యోగి

Published Sun, Nov 1 2015 11:57 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

రూ. 10 లక్షలతో ఉడాయించిన ఉద్యోగి

రూ. 10 లక్షలతో ఉడాయించిన ఉద్యోగి

కాకినాడ(తూర్పుగోదావరి): కాకినాడలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సీఎమ్‌యస్‌ సంస్థకు సంబంధించి 10 లక్షల రూపాయల నగదుతో ఆదివారం ఉడాయించాడు. దుర్గా భరణికుమార్‌ అనే వ్యక్తి సీఎమ్‌యస్‌ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సీఎమ్‌యస్‌ సంస్థ యాజమాన్యం విధుల్లో భాగంగా అతడికి ఏటీఎమ్‌లో నగదు పెట్టే బాధ్యతను అప్పగించింది.

పది లక్షల రూపాయల నగదును ఏటీఎంలో పెట్టకుండా దుర్గా భరణి అటునుంచే అటే డబ్బుతో పారిపోయాడు. దాంతో సీఎమ్‌యస్‌ సంస్థ యజమాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేసుకుని ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement