‘సహకారం’పై... వడ్డీ రాయితీల దెబ్బ
Published Tue, Mar 7 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
అమలాపురం టౌన్ :
క్షేత్రస్థాయిలో కీలకమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. ఒకప్పుడు లాభాలు, నిల్వలతో ఉన్న సంఘాలు ఇప్పుడు నష్టాల అంచులపై వేలాడుతున్నాయి. జిల్లాలోని 297 సహకార సంఘాల్లో ఏ సంఘం రికార్డులు పరిశీలించినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వడ్డీ రాయితీల నిధులు జమ కాకపోవడంతో సంఘాల ఆర్థిక ఉనికికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులకు సహకార సంఘాల ద్వారా ఇచ్చే పలు రకాలు రుణాలను సకాలంలో చెల్లిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత శాతాలతో వడ్డీ రాయితీలు ఇవ్వటం గత మూడు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. గత మూడు సంవత్సరాలుగా సంఘాలకు ప్రభుత్వాలు వడ్డీ రాయితీలకు సంబంధించిన నిధులు జమ చేయకపోవటంతో ఆర్థిక ఒడుదొడుకులు ప్రారంభమయ్యాయి. ఏడాది కిందటి వరకూ రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ నిల్వలతో ఉన్న సంఘాలు ఇప్పుడు ఇ¯ŒS బ్యాలె¯Œ్సలో పడిపోతున్నాయి.
ఆ రూ.90 కోట్లు జమైతేనే సంఘాలకు జీవం...
జిల్లాలో సహకార సంఘాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘ కాలిక, స్వల్ప కాలికంగా ఇస్తున్న వడ్డీ రాయితీల బకాయిలు గత మూడేళ్ల నుంచి దాదాపు రూ.90 కోట్లు పేరుకుపోయింది. ఒక్కో సంఘానికి రుణ బట్వాడాల స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఈ రాయితీల రూపేణా జమ కావాల్సి ఉంది. ఈ రూ.90 కోట్లు ప్రభుత్వాలు జమ చేస్తేనే సంఘాలు మనుగడ సాగించే అవకాశం ఉంది. 2016 సంవత్సరానికి దీర్ఘ కాలిక రుణాలపై ఇచ్చిన 6 శాతం వడ్డీ రాయితీ నిధులు దాదాపు రూ.15 కోట్ల వరకూ జమ కావాల్సి ఉంది. స్వల్పకాలిక రుణాలపై ఇస్తున్న 0 శాతం వడ్డీ రాయితీ అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే 4 శాతం రాయితీ 2103 నుంచి విడుదల కావల్సి ఉండగా...కేంద్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే 3 శాతం రాయితీ 2014 నుంచి రావాల్సి ఉంది. 0 శాతం వడ్డీ రాయితీ దాదాపు రూ.75 కోట్ల మేర పేరుకుపోయింది. 0 శాతం వడ్డీ వర్తింపునకు ప్రభుత్వం ప్రతి ఏటా ఓ జీవో విడుదల చేస్తుంది. 2015–16 సంవత్సరానికి ఆ జీవో విడుదల చేయకపోవటం గమనార్హం. ఈ పరిణామాన్ని గమనిస్తుంటే భవిష్యత్తులో 0 శాతం వడ్డీకి మంగళం పాడే అవకాశాలున్నాయనే అనుమానాన్ని బలపరుస్తోంది.
కొన్ని వైఫల్యాలూ కారణమే...
సహకార సంఘాలను పూర్తి కంప్యూటరీకరణ చేసి వాణిజ్య బ్యాంకుల మాదిరిగా వేగవంతంగా ఆ¯ŒSలై¯ŒS సేవలు చేయాలని జిల్లా సహకార శాఖ విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే దీన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాయి. రైతుల నుంచి రుణాలు జమైన వెంటనే ఆ సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ¯ŒSలై¯ŒSలో తక్షణమే వాణిజ్య బ్యాంకులు చేర్చుతాయి. సహకార సంఘాల్లో మాన్యువల్ విధానంలో రుణాలు జమవుతున్నా ఆ సమాచారం ప్రభుత్వాలకు అందటంలో జాప్యం జరుగుతోంది. అందుకే సంఘాలకు వడ్డీ రాయితీల నిధులు సకాలంతో జమ కావటం లేదని సహకార అధికారులు అంటున్నారు. ఆ¯ŒSలై¯ŒS లేదన్న సాకుతో రాయితీల నిధలు ఇవ్వకపోవటం అన్యాయమేమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లోన్నైనా జిల్లాలో సహకార రంగాన్ని ఆప్కాబ్, డీసీసీబీలు సానుకూలతతో చర్యలు చేపట్టాలని రైతు ప్రతినిధులు సూచిస్తున్నారు.
డీసీసీబీ మహా జనసభలో ప్రస్తావన...
సంఘాలకు వడ్డీ రాయితీల నిధులు జమకాని వైనంపై ఈ నెల మూడో తేదీన కాకినాడ డీసీసీబీ కార్యాలయంలో జరిగిన జన మహాసభలో జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు ప్రస్తావించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 0 వడ్డీకి విడుదలైన జీవో 270, ఆ తరువాత సరవణ జీవోతో సంఘాలకు వడ్డీ రాయితీలపరంగా ఇబ్బందులు లేవని..గత మూడేళ్లుగా కొర్రీ పెట్టడంతో సంఘాల మనగడ అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాగైతే సంఘాలను నడపలేం...
వడ్డీ రాయితీల నిధులు ప్రభుత్వాలు జమ చేయకపోతే సంఘాలను నడపలేం. ఇప్పటికే మా కోన సీమలోని 116 సంఘాల్లో 70 శాతం సంఘాలు ఆర్థిక నిల్వల పరంగా అ¯ŒS బ్యాలె¯Œ్సలో పడి సంఘాల మనుగడ ప్రశ్నార్ధకయ్యేలా మారాయి. అమలాపురం మండలంలో ఎ.వేమరం, సాకుర్రు, ఇందుపల్లి వంటి సంఘాల పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. రావాలి్సన వడ్డీ రాయితీల నిధులు జమ చేస్తేనే సహకార సంఘాల వ్యవస్థ కొనసాగుతుంది.
– గోకరకొండ విజయ రామారావు, అధ్యక్షుడు, కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య
Advertisement
Advertisement