మైనింగ్‌ ఏడీపై కలెక్టర్‌ మండిపాటు | collector serious on mining ad | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ ఏడీపై కలెక్టర్‌ మండిపాటు

Published Tue, Mar 28 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

collector serious on mining ad

కర్నూలు(అగ్రికల్చర్‌): గనుల శాఖ సహాయ సంచాలకులు వెంకటరెడ్డిపై జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా అజెండాను పరిశీలించారు. అందులో తూతూ మంత్రంగా వివరాలు ఉండటంతో ఏడీపై కలెక్టర్‌ నిప్పులు చెరిగారు. నేను చెప్పిందేమిటి.. తెచ్చింది ఏమిటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నదులు, బావుల్లో బోర్లు తవ్వుతున్న చర్యలు లేవంటూ మండిపడ్డారు. అజెండా అంశాలు ఏ విధంగా  ఉండాలో వివరించి  సమావేశాన్ని వచ్చే వారానికి వాయిదా వేశారు. సమావేశంలో జేసీ హరికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement