ప్రభుత్వ స్కూళ్లలోనే చదివే కలెక్టర్‌నయ్యా
ప్రభుత్వ స్కూళ్లలోనే చదివే కలెక్టర్‌నయ్యా
Published Wed, May 3 2017 10:04 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
– విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్
కర్నూలు సిటీ: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, వాటిలో చదివే తాను కలెక్టర్‌నయ్యానని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలపై కలెక్టర్ సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, మౌలిక సదుపాయలు కల్పించాల్సిన బాధ్యత ఎంఈఓలపై ఉంటుందన్నారు. అనుభవజ్ఞులైన టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే ఉన్నారనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ఐదేళ్లున్న పిల్లలందరినీ స్కూళ్లలో చేర్పించాలన్నారు. దీనిపై ఎంఈఓలు తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. జడ్పీ చైర్మెన్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో చాలా ప్రైవేటు స్కూళ్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయని, తక్షణమే వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఈఓ తాహెరా సుల్తానా, ఎస్‌ఎస్‌ఏ పీఓ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement