జయశంకర్ కలలుగన్న తెలంగాణ రావాలి
-
విరసం నాయకుడు వరవరరావు
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి దాకా కొత్తపల్లి జయశంకర్ పోరాడారని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర నాయకుడు వరవరరావు అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని శనివారం హన్మ కొండలోని జయశంకర్ స్మృతి వనం (ఏకశిల పార్కు)లో జయశంకర్ విగ్రహానికి వరవరరా వు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం ఆయన విలేకరులతో మాట్లాడారు. లాబీ యింగ్, ఆత్మహత్యలతో తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. దారులు వేరైనా తాను, జయశంకర్ ఈ దిశగా పోరాటం చేశామని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆర్‌ఎస్‌ఎస్ నుంచి రాడికల్స్ వరకు ఎవరినైనా కలుస్తానని, ఎవరితోనైనా పని చేస్తానని చెప్పి జయశంకర్ ముందుకు వెళ్లారన్నారు. జయశంకర్, కాళోజీ, బియ్యాల జనార్దన్‌రావు కలలుగన్న తెలంగాణ రావాల్సి ఉందన్నారు. తాను మావోయిస్టు పంథాలో పోతే, జయశంకర్ గాంధేయ మార్గం లో వెళ్లారని చెప్పారు. మా ఇద్దరివి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలని వరవరరావు తెలిపారు.
మార్గదర్శకుడు జయశంకర్
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఈ తరం చేసిన మహోన్నత పోరాటానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ మార్గదర్శకుడిగా నిలిచారని శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హన్మకొండలోని జయశంకర్ స్మృతివనంలో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి.. స్పీకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆచార్య జయశంకర్ మహోన్నతమైన వ్యక్తి గొప్ప కాలజ్ఞాని అని కొనియాడారు. ఆయన పుట్టిన గడ్డ మీద పుట్టడం, ఆయన శిషు్యడిగా, తెలంగాణ ఉద్యమంలో అతని వెన్నంటి పనిచేయడం ఎంతో అదృష్టమన్నారు. తెలంగాణ ను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తే అన్యాయం జరుగుతుందని ముందే చెప్పిన కాలజ్ఞాని అని కొనియాడారు.
అక్కంపేటలో నివాళి..
ఆత్మకూరు : జయశంకర్ పుట్టిన ఊరు అక్కంపేటలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయశంకర్ విగ్రహానికి డిప్యూటీ æసీఎం కడియం శ్రీహరి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ భావజాలాన్ని దశదిశలా వ్యాప్తిచేసిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. అక్కంపేట పాఠశాలకు 12 గదులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే అక్కంపేటకు సీసీ రోడ్ల కోసం తాను రూ.20 లక్షలు, ఎంపీ దయాకర్ ద్వారా రూ.10 లక్షలు ఇస్తామని, అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మార్చడానికి కృషిచేస్తానని, జయశంకర్ సార్ జ్ఞాపకార్థం కమ్యూనిటీహాల్ నిర్మాణం చేస్తామని తెలిపారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ జయశంకర్‌సార్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అకడమిక్ పాఠాలతోపాటు తెలంగాణ పాఠాలను చెప్పేవాడని గుర్తుచేశారు.
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ అక్కంపేట అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయసాధనకు ప్రతిఒక్కరు పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొద్దిరోజుల్లో అక్కంపేటకు రానున్నారని తెలిపారు. సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ అక్కంపేట గ్రామాన్ని తాము దత్తత తీసుకున్నామని, గ్రామంలో ప్రజల సహకారంతో 25వేల మొక్కలు నాటామని వివరించారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, ఆర్డీఓ వెంకటమాధవరావు, డీఎఫ్‌ఓ పురుషోత్తం, ఎంపీపీ గోపు మల్లికార్జున్, సర్పంచ్ కూస కుమారస్వామి, తహసీల్దార్ డీఎస్.వెంకన్న, ఎంపీడీఓ నర్మద, టీఆర్‌ఎస్ నాయకులు ధర్మరాజు, జాకీర్‌అలీ, కేశవరెడ్డి, బుచ్చిరెడ్డి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.