విద్యార్థిని అదృశ్యంపై ఫిర్యాదు
Published Wed, Feb 15 2017 12:51 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పుట్టపర్తి అర్బన్ : మండలంలోని వెంగâýæమ్మచెరువు గ్రామ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని వాగ్దేవి (13) వారం రోజులుగా కన్పించడం లేదని బాలిక తాత రామచంద్ర సోమవారం రూరల్ ఎస్ రాఘవరెడ్డి, తహశీల్దార్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన మేరకు.. నరసింహులు, అరుణ దంపతుల కుమార్తె వాగ్దేవి. తల్లి మృతి చెందటంతో నరసింహులు మరోవివాహం చేసుకున్నాడు. దీంతో వాగ్దేవి అవ్వాతాతల వద్దే ఉంటోంది. ఈనెల 7న ఉదయం 9 గంటలకు యథావిధిగా పాఠశాలకు వెళ్లింది. అయితే వాగ్దేవి పాఠశాలకు రాలేదని అదే రోజు ఉదయం 11గంటలకు విద్యార్థిని తాత రామచంద్రకు టీచర్లు కబురు పంపారు. నాటి నుంచి స్నేహితులు, బంధువుల వద్ద ఎంతగాలించినా వాగ్దేవి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Advertisement
Advertisement