'టీఆర్ఎస్తో తెలంగాణ రాలేదు..కాంగ్రెస్ వల్లే వచ్చింది' | congress leader jana reddy demands to trs government over election promises | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్తో తెలంగాణ రాలేదు..కాంగ్రెస్ వల్లే వచ్చింది'

Published Sun, Jul 10 2016 8:05 PM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

'టీఆర్ఎస్తో తెలంగాణ రాలేదు..కాంగ్రెస్ వల్లే వచ్చింది' - Sakshi

'టీఆర్ఎస్తో తెలంగాణ రాలేదు..కాంగ్రెస్ వల్లే వచ్చింది'

నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ రాష్ట్రం రాలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే మాత్రమే వచ్చిందని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. మిర్యాలగూడలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ...కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా, సాగర్ ఆయకట్టు రెండో పంటకు నీరు ఇచ్చినా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని జానారెడ్డి స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement