13 నుంచి కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
అనంతపురం సెంట్రల్ : కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈ నెల 13 నుంచి 19 వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారు ఈ పరీక్షలో పాల్గొంటారని వివరించారు. ఎక్కడా లోటుపాట్లు రాకుండా అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు. ఫిట్‌నెస్‌లో ఎంపికైన అభ్యర్థులకు పరుగుపందెం, లాంగ్‌జంప్ పోటీలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.